ETV Bharat / state

సొంత పన్నుల ఆదాయంలో చివరి స్థానంలో ఏపీ - OWN TAX REVENUE IN AP

సొంత ఆదాయాలు, స్థూల ఉత్పత్తిలో ఏపీ చిట్టచివరి స్థానం-గడిచిన 7,8 నెలల్లో 12.94 శాతంగా వృద్ధిరేటు నమోదు

Own Tax Revenue In AP
Own Tax Revenue In AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2025, 11:53 AM IST

AP Ranks Last In Own Tax Revenue: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం కారణంగా సొంత పన్నుల ఆదాయంలోనూ రాష్ట్రం వెనుకపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఆదాయ వృద్ధి పరుగులు తీయడం లేదు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలో సొంత ఆదాయ వనరులపై 2019-24 మధ్య గణాంకాలను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సొంత ఆదాయం పైనా నివేదికలు రూపొందించింది. ఆదాయంతో పాటు జీఎస్​డీపీలోలోనూ రాష్ట్రం చివరిస్థానానికి పడిపోయిన పరిస్థితి నెలకొంది.

సొంత పన్నుల ఆదాయంలో ఏపీ చివరిస్థానం: జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన పరిస్థితులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సొంత ఆదాయాలు, స్థూల ఉత్పత్తి ఈ రెండింటిలోనూ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చిట్టచివరి స్థానంలో నిలిచిన దుస్థితి నెలకొంటోంది. గడచిన ఏడెనిమిది నెలల్లో వృద్ధి రేటు 12.94 శాతం నమోదైనా గత ఐదేళ్లలో నమోదైన తిరోగమన పరిస్థితులు రాష్ట్ర ఆదాయాన్ని వెనక్కు నెట్టాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ నమోదు చేసిన గణాంకాల మేరకు ఆంధ్రప్రదేశ్ వెనుక వరుసలో నిలిచింది.

2019లో సొంత ఆదాయం 60 వేల 916 కోట్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2024 వచ్చేసరికి 93 వేల 354 కోట్లకు చేరుకుంది. గత ఐదేళ్లలో సొంత ఆదాయంలో 53 శాతం మాత్రమే వృద్ధి నమోదైనట్లు తేలింది. సొంత ఆదాయాల్లో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 94 శాతం వృద్ధితో తొలి స్థానంలో ఉంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు 61 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మహారాష్ట్ర 58 శాతం, కేరళ 55 శాతం వృద్ధిని కలిగి ఉన్నాయి. ఇక మొత్తం జీఎస్​డీపీలో సొంత ఆదాయం వాటాలోనూ ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలోనే నిలిచింది. 2019-20లో 6.3 శాతంగా ఉన్న సొంత ఆదాయం వాటా 2023-24 నాటికి 6.5 శాతానికి మాత్రమే పెరిగింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ 9.5 శాతంతో దక్షిణాది రాష్ట్రాలతో ముందుంటే, కేరళ 8.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అంచనాలను సిద్ధం చేస్తున్న ఆర్థికశాఖ ఈ గణాంకాలను ముఖ్యమంత్రికి సమర్పించింది.

ప్రోగ్రెసివ్ నిర్ణయాలతో తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర జీఎస్​డీపీ సహా సొంత ఆదాయ వనరుల్ని పెంచుకుంటే, అందుకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం తిరోగమన నిర్ణయాలతో ఆదాయాలను కుదేలు చేసింది. ప్రత్యేకించి పన్ను ఆదాయం పడిపోవటం, ఇతర రెవెన్యూలలో లోటు వంటి అంశాలు ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ ఆ వ్యవస్థ కుదురుకోక ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.

లోక్‌సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు- విపక్షాలు వాకౌట్

'ఇన్​కం ట్యాక్స్​' ఇక మరింత ఈజీ! కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు ఇవే!

లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ- రూపాయి అందుకే క్షీణించిందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.