Somireddy Chandramohan Reddy comments On YS Jagan: జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల పరామర్శకు వెళ్లాడా? లేక మిరపకాయల దొంగతనానికి వెళ్లాడా? అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ వెంట వెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి 14 టిక్కీల మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారని ఆయన ఆరోపించారు. దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతూ, తండ్రికి బంగారు నగల దుకాణం, 3 అంతస్తుల మేడ ఉన్న ఓ పిల్ల చేత అమ్మ ఒడి రాలేదంటూ నిన్న పేటీఎమ్ బ్యాచ్‌తో డ్రామాలాడించాడని ఆయన మండిపడ్డారు.
పేటీయం బ్యాచ్‌తో డ్రామాలాడారని మండిపాటు: ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు అనే చైల్డ్ ఆర్టిస్ట్ బాగా యాక్ట్ చేశాడని మంచి పేరు పొందాడని సోమిరెడ్డి అన్నారు. అదే విధంగా సినిమాలకు చైల్డ్ ఆర్టిస్టుల కొరత ఉందని ఓ పక్క దర్శకులు అంటుంటే వారిని ట్రైన్ చేసే పనిలో వైఎస్సార్సీపీ పేటీఎం బ్యాచ్ ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. మగవాళ్ల అందం గురించి మరో మగాడైన జగన్ మాట్లాడటం ఏదో తేడాగా ఉందని వ్యాఖ్యానించారు. వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ ల అందాలు జగన్ ఎప్పుడు చూశాడని ఆయన ప్రశ్నించారు.
జగన్ కంటే అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడని వైఎస్సార్సీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన హయాంలో వ్యవసాయ శాఖను మూసేసిన ఎన్నో దారుణాలకు జగన్ కారణమని ఆయన విమర్శించారు. రైతులు కష్టాలతో ఉంటే రౌడీలను వెంటపెట్టుకుని మరీ 14 మిర్చి టిక్కీలు దొంగతనం చేయిస్తావా అని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా డ్రామాలకు తెరదించాలని ఆయన అన్నారు. మిర్చికి ఎంఎస్పీ 7 వేల ధర నిర్ణయించింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. మిర్చి రైతులకు, వ్యవసాయ రంగానికి జగన్ చేసిన నష్టంపై మాజీ వ్యవసాయ మంత్రులు కాకాణి, కన్నబాబు ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని సోమిరెడ్డి సవాల్ చేశారు. మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు జగన్ ఎందుకు బయటకు రాలేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు.
''జగన్ వెంట వెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి 14 టిక్కీల మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారు. జగన్ కంటే అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడని వైఎస్సార్సీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. మగవాళ్ల అందం గురించి మరో మగాడైన జగన్ మాట్లాడటం ఏదో తేడాగా ఉంది''-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు
'జగన్ ఆస్తులను జాతీయం చేసి ప్రజలకు పంచాలి - భూ కేటాయింపులు రద్దు చేయాలి'
మమ్మల్ని తరిమేయడం కాదు - మీ సంగతి చూసుకోండి: సోమిరెడ్డి - tdp leader on ysrcp leaders attacks