ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : అనకాపల్లిలో ప్రధాని మోదీ అనంతరం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - AKP cbn PUBLIC MEETING LIVE - AKP CBN PUBLIC MEETING LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 6:30 PM IST

Updated : May 6, 2024, 7:11 PM IST

Chandrababu Meeting Live: అనకాపల్లి ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. ఈ సందర్భగా చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులఊబిలో నెట్టింది. వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా అవినీతి వంద శాతం పెరిగింది.  మద్యనిషేధం పేరు చెప్పి జగన్‌ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్‌తో పరిగెత్తింది. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదు. మూడు రాజధానులు పేరిట ఏపీని లూటీ చేశారు. వైసీపీ అవినీతి నిర్వహణ తప్ప.. ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. పోలవరానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆపేసిందని చంద్రబాబు తెలిపారు. 
Last Updated : May 6, 2024, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details