ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: తెనాలి ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam Sabha - CHANDRABABU PRAJAGALAM SABHA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 8:31 PM IST

Updated : Apr 30, 2024, 9:18 PM IST

Chandrababu Prajagalam Public Meeting Live: ఆంధ్రప్రదేశ్​లో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బీసీలను హత్య చేసిన వైసీపీ గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ ఇస్తామని, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్​కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అధికార వైసీపీ అన్నింట్లోనూ పూర్తిగా విఫలం అయిందని, హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ప్రజలంతా గ్రహించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి కూటమి పాలన రావాలని పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుతం తెనాలి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 30, 2024, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details