ETV Bharat / state

డేంజర్​లో ఆంధ్రప్రదేశ్​ - 44 శాతం భూభాగంపై విపత్తుల ప్రభావం - CLIMATE CHANGE IMPACTS ON AP

ప్రకృతి విపత్తులతో ప్రభావితం అవుతున్న ఆంధ్రప్రదేశ్​ - పొంచి ఉన్న వరద, కరవు ముప్పు

Climate_Change_Impacts_on_AP
Climate Change Impacts on AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 10:19 AM IST

Climate Change Impacts on AP: వాతావరణ మార్పులు జీవకోటికి, ప్రభుత్వాలకు పెను సవాళ్లను విసురుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని అన్ని జిల్లాలూ ప్రకృతి విపత్తులతో ప్రభావితం అవుతున్నాయి. వాయుగుండాలు, తుపాన్లు, వరదలు, పిడుగుపాట్లు, వడగాలులు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో ఆంధ్రప్రదేశ్​లోని కొన్ని జిల్లాలకు వరద ముప్పు, మరికొన్ని జిల్లాలకు కరవు ముప్పు పొంచి ఉంది.

ఐఐటీ మండీ, ఐఐటీ గువాహటి కలసి సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ పాలసీ (CSTEP) సహకారంతో తాజాగా చేపట్టిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన సూచీలకు అభివృద్ధితో సంబంధం ఉంటుందని, ప్రభుత్వాలు ఈ స్టడీని పరిగణనలోకి తీసుకుని, దీర్ఘకాల సన్నద్ధత, నష్ట నివారణకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

వాతావరణ మార్పులతో బ్రెయిన్​పై తీవ్ర ప్రభావం- ఉష్ణోగ్రతలతో వారికి చాలా డేంజర్! - Climate Change Impact On brain

భారీ వర్షాలతో అతలాకుతలం: ఆంధ్రప్రదేశ్​లో 44 శాతం భూభాగం తుపాన్లు, సంబంధిత ప్రమాదాలకు ఆలవాలమని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో, డిసెంబరు తర్వాత ఆంధ్రప్రదేశ్​పై తుపాన్ల ప్రభావం కనపడుతోంది. నైరుతి రుతుపవనాల టైమ్​లో కనీసం ఒక్క తుపాను అయినా కోస్తా తీరాన్ని తాకుతుంది. ఈశాన్య రుతుపవనాల కాలంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలు, మరికొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఆయా కాలాల్లో ఆంధ్రప్రదేశ్​లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, వంశధార, నాగావళి తదితర నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ఆయా నదుల పరిసర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. 2005 నుంచి 2024 మధ్య కాలంగా ముఖ్యంగా 2011, 2016, 2017 సంవత్సరాలు మినహాయించి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతం వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది. 2005లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటిమట్టం పెరగడంతో అత్యధికంగా 10 ఉమ్మడి జిల్లాలపై ఆ ఎఫెక్ట్ చూపించింది.

ప్రకృతి విపత్తుల సమయంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను తుపాను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని, అయితే దీంతో పాటు పూరిళ్లు, పెంకుటిళ్లలో నివసించేవారికి పక్కాగృహాలు నిర్మించడం ముఖ్యమని వాతావరణ నిపుణులు కేజే రమేశ్ తెలిపారు. తుపాన్ల సమయంలో విద్యుత్తు రంగం తీవ్రంగా ప్రభావితమవుతోందని, స్తంభాలు పడిపోవడం, మళ్లీ కొత్తవి ఏర్పాటుచేయడం పరిపాటిగా మారుతోందని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై దృష్టిపెడితే ప్రతిసారీ నష్టం భరించాల్సిన అవసరముండదని చెప్పారు. అన్ని రకాల ప్రకృతి విపత్తులను తట్టుకునేలా రోడ్లు, కల్వర్టులు, వంతెనలను నిర్మించాలని కేజే రమేశ్ సూచించారు.

అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్​ 5లో ఒకటి - Weather Report in 2024

తాజా స్టడీ ప్రకారం వరద ముప్పును ఎదుర్కొనే ఉమ్మడి జిల్లాలు ఇవే:

  • ఎక్కువ ప్రభావం: పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు
  • మధ్యస్థంగా: శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు
  • తక్కువగా: విశాఖపట్నం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు

కరవు పొంచి ఉన్న ఉమ్మడి జిల్లాలు:

  • ఎక్కువగా: విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు
  • మధ్యస్థంగా: శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు
  • తక్కువగా: నెల్లూరు జిల్లా

భారత్​లో భిన్న వాతావరణ పరిస్థితులు - ఓచోట కరవు మరోచోట వరదలు - ఎందుకిలా? - Prof Raghu Murtugudde on Climate

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.