Mangoes in December: మామిడిపండ్ల కోసం సమ్మర్ ఎప్పుడొస్తుందా అంటూ చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. మామిడిపండ్లు అంటే భారతీయులకు ఉండే ప్రేమ అలాంటిది మరి. అయితే ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా మామిడిపండ్లు దొరికేస్తున్నాయి. వేసవిలో రావాల్సిన మామిడి పండ్లు డిసెంబర్ నెలలోనే అందుబాటులోకి వచ్చాయి.
అంతే కాకుండా ఏప్రిల్‌లో లభించి ఎండ తీవ్రతను దూరం చేసే తాటిముంజలు సైతం అప్పుడే విక్రయానికి రహదారి పక్కన కనిపిస్తున్నాయి. ఇవి ‘పైరుకాపు’ ఉత్పత్తులని, వందల చెట్లలో కొన్ని మాత్రమే ఇలా ముందుగానే కాస్తాయని అన్నదాతలు చెబుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో తోటల్లోని సుమారు 2 వేల మామిడి చెట్లలో పైరుకాపు పండ్లు నాలుగు టన్నుల దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.
వాటిని విజయవాడ కృష్ణలంక సమీపంలో రహదారిపై అమ్ముతున్నారు. కిలో మామిడి 250 రూపాయల నుంచి 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా బందరు రోడ్డులోని గంగూరు సమీపంలో పైరుకాపులో వచ్చిన తాటిముంజలను డజను 100 రూపాయల నుంచి 120 రూపాయలకి అమ్ముతున్నారు.
మామిడి పండ్లతో ఎన్నో ఉపయోగాలు: మామిడి పండ్లలో ఉండే విటమిన్-ఏ, విటమిన్-సీ వంటి ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తికి, కంటిని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే మామిడి పంట్లలో ఎక్కువ మొత్తంలో లభించే ఫైబర్ జీర్ణ క్రియని ప్రోత్సహించడం, బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతాయి. మామిడిపండ్లలో ఉండే బీటా కెరోటిన్ ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో ఉపయోగపడతాయి.
క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్-కె, మెగ్నీషియం, పొటాషియం కలిగి ఉండే మామిడి పండ్లు గుండె ఆరోగ్యం, ఎముకల బలం మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. మామిడిపండ్లలో అధికంగా లభించే విటమిన్-సీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే మామిడి పంట్లలోని డైటరీ ఫైబర్ పేగుల కదలికలను ప్రోత్సహించి మలబద్దకం, జీర్ణ రుగ్మతలను నివారించి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో ఎందుకు ఉంచాలో తెలియాలంటే దీనిపై క్లిక్ చేయండి
పచ్చి మామిడి Vs పండిన మామిడి - ఏది ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా? - Raw Mango Vs Ripe Mango
క్యాన్సర్ నుంచి డీహైడ్రేషన్ వరకు - తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్! - Ice Apple Health Benefits