Vijayawada Krishnamma Jalavihar Park: గత వైఎస్సార్సీపీ పాలకులు అభివృద్ధి పేరుతో జేబులు నింపుకున్నారనడానికి చక్కటి ఉదాహరణ విజయవాడలోని కృష్ణమ్మ జలవిహార్ పార్క్ పనులు. గత పాలనలో కోట్ల రూపాయలు వెచ్చించి రివర్ ఫ్రంట్ సుందరీకరణ పనులు చేపట్టారు. అధికారుల అలసత్వం పాలకుల నిర్లక్ష్యంతో నిర్మించిన కొన్నాళ్లకే అది అస్తవ్యస్తంగా మారింది. నాసిరకం పనులు చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం పార్క్ మూతపడి నిరుపయెగంగా దర్శమనిస్తోంది.
కృష్ణా నది వరద ఉద్ధృతికి కృష్ణలంకకు చెందిన కాలనీలు ముంపునకు గురవుతున్నాయని గతంలో టీడీపీ ప్రభుత్వం మూడు దశల్లో రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదించింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండు ప్యాకేజీలుగా చేసింది. రామలింగేశ్వరనగర్ నుంచి వారథి వరకు, వారథి నుంచి పీఎన్‌బీఎస్ వరకు నిర్మించింది. రక్షణ గోడకు అనుకుని ఉన్న స్థలంలో 12 కోట్ల 40 లక్షల రూపాయల అంచనాతో రివర్ ఫ్రంట్ సుందరీకరణ పనులు చేపట్టారు. 1.2 కి.మీ పొడవులో జలవిహార్‌ను ఏర్పాటు చేశారు. టైల్స్, సుందరీకరణ, గ్రీనరీ ఏర్పాటు చేసేలా గుత్తేదారులకు అప్పగించారు.
తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారో తెలియదు - సంపద సృష్టిస్తేనే ఆదాయం పెంపు: చంద్రబాబు
పనులు పూర్తిగాకుండానే ప్రారంభం: పార్కులో కొంత భాగం గ్రీనరీ, కుర్చీలు, చిన్న పిల్లల ఆటవస్తువులు ఏర్పాటు చేసి మిగితా భాగంలో సుందరీకరణ, ఎటునంటి సౌకర్యాలు కల్పించలేదు. నాసికరకంగా పనులు చేసి అధిక మొత్తంలో నిధులు మింగేశారన్న ఆరోపణలున్నాయి. పనులు పూర్తవ్వకపోయినా జగన్ హడావుడిగా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు గత ఏడాది మార్చిలో పార్క్‌ను ప్రారంభించారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చెట్లు, ఆటవస్తువులకు భారీగా నిధులు కేటాయించారు. వాకింగ్ ట్రాక్‌కు నదిలో ఇసుక, తెలికపాటి మట్టి వేసి పైన ఫేవర్ బ్రిక్స్ వేయడంతో ట్రాక్ గుల్లబారి బ్రిక్స్ పైకి తేలిపోయాయి. కుర్చీలు, చిన్న పిల్లల ఆటవస్తువులు విరిగి చిందరవందరగా తయారయ్యాయి. పార్క్ నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు చెబుతున్నారు.
నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు: పార్క్ ప్రారంభమైన రోజు నుంచి నగరపాలక అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. కట్టకు పక్కన ఉన్న స్థానికులు ప్రహరీ దూకి లోపలకు ప్రవేశిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలు పార్క్ మీద కట్టకు అవతల వైపు ఉన్న రామలింగేశ్వరనగర్, భూపేష్‌గుప్తానగర్, తారక రామానగర్ ప్రాంతాల్లో వరద చేరింది. పెద్ద పెద్ద మోటార్లతో నదిలోకి తోడారు. దీంతో పార్క్ లోని చాలా వరకు మొక్కలు, నేల కొట్టుకుపోయింది. ప్రస్తుతం గత మూడు నెలల నుంచి పార్కును అధికారులు మూసివేశారు. కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు చేసి పార్కును ప్రాంరభించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి పార్కుకు మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.
ఆరోజు చూసిన కన్నీటి గాథలు, ఇచ్చిన హామీలు నేటీకీ గుర్తున్నాయి: నారా లోకేశ్