Best Laptops Under 50000 : న్యూ ఇయర్‌లో మంచి ల్యాప్‌టాప్ కొనాలా? వర్క్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా అన్నింటికీ అనువుగా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. రూ.50వేలు బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 ల్యాప్‌టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. HP 14S (2020)
తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవారికి ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ బాగుంటుంది. దీని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. గేమింగ్‌కు, సినిమాలు చూడడానికి, ఆఫీస్ వర్క్‌కు అన్నింటికీ ఇది సపోర్ట్ చేస్తుంది.
- డిస్‌ప్లే సైజ్ - 14 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 1920x1080 పిక్సెల్స్
- ప్రాసెసర్ - కోర్ ఐ3
- ర్యామ్ - 4 జీబీ
- ఓఎస్ - విండోస్ 10 హోమ్
- హార్డ్ డిస్క్ - 1 టీబీ
- వెయిట్ - 1.53 కేజీ
- ధర - రూ.49,999
2. Lenovo IdeaPad 330E-151KB
లెనోవో కంపెనీ విడుదల చేసిన బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్‌ల్లో ఇది ఒకటి. ఆఫీస్ వర్క్ చేయడానికి, వీడియో గేమ్స్ ఆడడానికి ఇది బాగుంటుంది.
- డిస్‌ప్లే సైజ్ - 15.60 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 1920x1080 పిక్సెల్స్
- ప్రాసెసర్ - కోర్ ఐ5
- ర్యామ్ - 8 జీబీ
- ఓఎస్ - డీఓసీ
- హార్డ్ డిస్క్ - 2 టీబీ
- గ్రాఫిక్స్ - ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 620
- వెయిట్ - 2.20 కేజీ
- ధర - రూ.49,500
3. Microsoft Surface Pro M1796-KJR-00015
మంచి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవారికి ఈ మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. గేమ్స్ ఆడేవారు కూడా దీనిని కొనుక్కోవచ్చు.
- డిస్‌ప్లే సైజ్ - 12.50 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 2736x1824 పిక్సెల్స్
- టచ్‌స్క్రీన్ - ఉంది
- ప్రాసెసర్ - కోర్ ఐ5
- ర్యామ్ - 8 జీబీ
- ఓఎస్ - విండోస్ 10
- హార్డ్ డిస్క్ - లేదు
- ఎస్‌ఎస్‌డీ - 128 జీబీ
- గ్రాఫిక్స్ - ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ హెచ్‌డీ గ్రాఫిక్స్
- ధర - రూ.49,990
4. Dell Vostro 2420
డెల్ కంపెనీ ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారు దీనిపై ఓ లుక్కేయవచ్చు. ఆఫీస్ వర్క్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది.
- డిస్‌ప్లే సైజ్ - 14అంగుళాలు
- ప్రాసెసర్ - కోర్ ఐ3
- ర్యామ్ - 2 బీ
- ఓఎస్ - లీనక్స్
- హార్డ్ డిస్క్ - 500 జీబీ
- గ్రాఫిక్స్ - ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ హెచ్‌డీ గ్రాఫిక్స్
- వెయిట్ - 2.19 కేజీ
- ధర - రూ.50,000
5. Infinix Inbook Air Pro+
మీడియం బడ్జెట్లో మంచి ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది చాలా స్లిమ్‌గా, లైట్ వెయిట్‌తో ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.
- డిస్‌ప్లే సైజ్ - 14 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 2800x1800 పిక్సెల్స్
- టచ్‌స్క్రీన్ - లేదా
- ప్రాసెసర్ - కోర్ ఐ5
- ర్యామ్ - 16 జీబీ
- ఓఎస్ - విండోస్ 11
- హార్డ్‌డిస్క్ - లేదు
- ఎస్‌ఎస్‌డీ - 512 జీబీ
- గ్రాఫిక్స్ - ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ఈ
- వెయిట్ - 1కేజీ
- ధర - రూ.49,900
6. Acer Swift 3 (SF314-511)
డైలీ ఆఫీస్ వర్క్ చేసేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లోనూ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
- డిస్‌ప్లే సైజ్ - 14 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 19200x1080 పిక్సెల్స్
- ప్రాసెసర్ - కోర్ ఐ5
- ర్యామ్ - 16 జీబీ
- ఓఎస్ - విండోస్ 11
- ఎస్‌ఎస్‌డీ - 512 జీబీ
- వెయిట్ - 1.20 కేజీ
- ధర - రూ.49,900
7. MSI GL63-8RC
విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ ఉపయోగపడే ల్యాప్‌టాప్ ఇది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది.
- డిస్‌ప్లే సైజ్ - 15.60 అంగుళాలు
- ప్రాసెసర్ - కోర్ ఐ7
- ర్యామ్ - 8 జీబీ
- ఓఎస్ - విండోస్ 10 హోమ్
- ఎస్‌ఎస్‌డీ - లేదు
- హార్డ్ డిస్క్ - 1 టీబీ
- ధర - రూ.49,900
8. Asus Vivobook S14 OLED AMD
ఈ ల్యాప్‌టాప్ వర్క్‌కే కాదు, చిన్నపాటి గేమ్స్ ఆడడానికి కూడా అనువుగా ఉంటుంది.
- డిస్‌ప్లే సైజ్ - 14 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 2880x1800 పిక్సెల్స్
- ప్రాసెసర్ - కోర్ ఐ7
- ర్యామ్ - 16 జీబీ
- ఓఎస్ - విండోస్ 11
- హార్డ్‌డిస్క్ - లేదు
- ఎస్‌ఎస్‌డీ - 1 టీబీ
- గ్రాఫిక్స్ - ఏఎండీ రేడియాన్ ఇంటిగ్రేటెడ్
- వెయిట్ - 1.40 కేజీ
- ధర - రూ.44,490
9. Realme Book Slim
తక్కువ బడ్జెట్లో ఆఫీస్ వర్క్ కోసం ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. కానీ దీనితో గేమ్స్ ఆడలేరు.
- డిస్‌ప్లే సైజ్ - 14 అంగుళాలు
- డిస్‌ప్లే రిజల్యూషన్ - 2160x1440 పిక్సెల్స్
- ప్రాసెసర్ - కోర్ ఐ3
- ర్యామ్ - 8 జీబీ
- ఓఎస్ - విండోస్ 10
- ఎస్‌ఎస్‌డీ - 256 జీబీ
- వెయిట్ - 1.38 కేజీ
- ధర - రూ.43,016
10. Xiaomi RedmiBook 15 Pro
కాలేజీ విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ వర్క్‌లు చేయడానికి ఇది అనువుగా ఉంటుంది.
- డిస్‌ప్లే సైజ్ - 15.60 అంగుళాలు
- ప్రాసెసర్ - కోర్ ఐ5
- ర్యామ్ - 8 జీబీ
- ఓఎస్ - విండోస్ 10 హోమ్
- ఎస్‌ఎస్‌డీ - 512 జీబీ
- వెయిట్ - 1.80 కేజీ
- ధర - రూ.49,999
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన ల్యాప్‌టాప్‌ల ధరలు వివిధ వెబ్‌సైట్లలో భిన్నంగా ఉంటాయి. గమనించగలరు.