Secured Vs Unsecured Credit Cards : మీరు మంచి క్రెడిట్ కార్డ్ తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. క్రెడిట్ కార్డ్‌లు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి:
- సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్
- అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్
వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Secured Credit Card Pros And Cons : మీరు చేసే క్యాష్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను తాకట్టుగా ఉంచుకొని, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు - సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌లను ఇస్తాయి. అంటే మీరు చేసిన డిపాజిట్ అమౌంట్‌లో 75%-85% లిమిట్‌తో క్రెడిట్ కార్డ్‌లను జారీ ఇస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే, క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. ఒకవేళ డిపాజిట్ మొత్తం తక్కువగా ఉంటే, క్రెడిట్ లిమిట్ తగ్గుతుంది.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ వల్ల కలిగే ఉపయోగాలు :
- మీరు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. పైగా దానిని కొలాటరల్‌గా పెట్టుకొని క్రెడిట్ కార్డ్ ఇస్తారు.
- ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చు. చక్కగా సమయానికి ఈఎంఐ చెల్లిస్తూ, మీ క్రెడిట్ స్కోర్‌ను మళ్లీ పెంచుకోవచ్చు.
- అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను పొందడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. కానీ కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అదే అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ కావాలంటే కచ్చితంగా మీ ఆదాయ వివరాలు, మల్టిపుల్ వెరిఫికేషన్స్, క్రెడిట్ స్కోర్ అవసరం అవుతాయి.
- మీకు కనుక ఈ సెక్యూర్డ్ కార్డ్ కావాలంటే ఆయా బ్యాంకులను బట్టి కనీసంగా రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. ఈ అకౌంట్ నిర్ణీత కాలంపాటు లాక్ అవుతుంది. మీకు కనుక ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోని డబ్బులు కావాలంటే, ఖాతాను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లేదా రెగ్యులర్ అకౌంట్‌గా మార్చాల్సి ఉంటుంది.
Unsecured Credit Card Pros And Cons : బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను ఇస్తాయి. ఇందుకోసం ఎలాంటి డిపాజిట్‌లు, తనఖాలు అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్, ఆదాయం, రుణం, అప్పు తీర్చే సామర్థ్యం, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో మొదలైనవి పరిశీలించి ఈ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తాయి.
అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ వల్ల కలిగే ఉపయోగాలు :
- ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులు ఇస్తాయి. ఇందుకోసం ఎలాంటి డిపాజిట్లు కూడా చేయాల్సిన అవసరం లేదు.
- మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ లభిస్తుంది.
- మీరు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌ను బట్టి వివిధ రివార్డ్‌లు, ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి.
- తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, బ్యాంకులు ఈ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు.
- అన్‌సెక్యూరిటీ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి బ్యాంకులు చాలా తనిఖీలు చేస్తాయి. చాలా డాక్యుమెంట్లను పరిశీలిస్తాయి. అందువల్ల ఇవి మంజూరు కావడానికి చాలా సమయం పడుతుంది. కనుక మీ అవసరాలకు అనువైన క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవడం మంచిది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
క్రెడిట్ కార్డ్ బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా? ఈ సుప్రీంకోర్ట్ తీర్పు తెలుసుకోవాల్సిందే!