LIVE : కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేత మహ్మద్ అలాఉద్దీన్ పార్టీలో చేరిక - BRS KTR PRESSMEET
Published : Oct 9, 2024, 1:12 PM IST
|Updated : Oct 9, 2024, 1:29 PM IST
BRS Working President KTR Press Meet : ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 23 సార్లు హైద్రాబాద్- సికింద్రాబాద్‌కు తిరిగినట్టు దిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎంకు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదు లక్షల మంది రైతన్నలు రెండు లక్షల రూపాయల లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తిరైతులు దళారుల చేతిలో దగా అయ్యి అల్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక పాలన పుణ్యమా అని ఈ దసరా తెలంగాణ ప్రజలకు దసరాలాగా లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో మహ్మద్ అలా ఉద్దీన్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు.
Last Updated : Oct 9, 2024, 1:29 PM IST