LIVE: కేటీఆర్ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - BRS WORKING PRESIDENT KTR LIVE
Published : Jan 7, 2025, 8:03 PM IST
|Updated : Jan 7, 2025, 8:21 PM IST
BRS Working President KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేత, తదనంతర పరిణామాలపై ఆయన మాట్లాడుతున్నారు. ఎదురుదెబ్బ తర్వాత పునరాగమనం మరింత బలంగా ఉంటుందని అన్నారు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయని, న్యాయవ్యవస్థను తాను గౌరవిస్తానని తెలిపారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా-ఈ కేసులో కేసులో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పు చేసినట్లు నిరూపిస్తే అబిడ్స్ చౌరస్తాలో ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెడుతోందని జరగబోయే అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని కేటీఆర్ తెలిపారు. కాగా కొద్ది సేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ, పలువురు సిబ్బంది చేరుకున్నారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ పోలీసులు సమావేశమయ్యారు. తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. ఈ ప్రెస్‌మీట్‌ను లైవ్‌లో చూద్దాం.
Last Updated : Jan 7, 2025, 8:21 PM IST