LIVE : గ్రూప్స్ పరీక్షలపై కేటీఆర్ మీడియా సమావేశం - KTR LIVE - KTR LIVE
Published : Jun 27, 2024, 4:09 PM IST
|Updated : Jun 27, 2024, 4:21 PM IST
BRS KTR LIVE : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో పాసైన అభ్యర్థులను 1:100 చొప్పున మెయిన్స్ రాయడానికి అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. అలాగే మెగా డీఎస్సీ పేరుతో 11,000 ఉద్యోగాలను మాత్రమే జారీచేశారని, ఉపాధ్యాయ పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను నోటిఫీకేషన్లో కలిపి 25000 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని పేర్కొన్నారు. గురుకుల అభ్యర్థుల సైతం పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారని, గురుకులాల్లో ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని స్ఫష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను పక్కన పెట్టి దిల్లీ పర్యటనలతో రాజకీయాలపై శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గుతోందని పేర్కొన్నారు. ఇవాళ గ్రూప్-1 నిరుద్యోగ అభ్యర్థులందరూ మాజీమంత్రి కేటీఆర్‌ను కలిశారు. మెయిన్స్ రాయడానికి 1:100 చొప్పున అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్ర సమర్పించారు.
Last Updated : Jun 27, 2024, 4:21 PM IST