తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్​లో కేటీఆర్ మీడియా సమావేశం - ktr live - KTR LIVE

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 5:16 PM IST

Updated : May 2, 2024, 5:47 PM IST

KTR Press meet Live : అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే సాకుతో ఎన్నికల కమిషన్, తెలంగాణ ఆవాజ్​ కేసీఆర్​ గొంతు పైనే నిషేధం విధించడం అరాచకమంటూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని ప్రశ్నించారు. మోదీ ప్రసంగాలపై వేల ఫిర్యాదులు వచ్చినా చర్యల్లేవు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్​ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని విరుచుకుపడ్డారు. బడే భాయ్​, చోటే భాయ్​ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అంటూ కేటీఆర్​ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేసీఆర్ పోరు బాట కార్యక్రమం చూసి ఎందుకు కాంగ్రెస్​, బీజేపీ వాళ్లు వణికిపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అహంకారానికి, సంస్థాగత దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Last Updated : May 2, 2024, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details