LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీడియా సమావేశం - BRS MLAs Press Meet live - BRS MLAS PRESS MEET LIVE
Published : Aug 17, 2024, 12:08 PM IST
|Updated : Aug 17, 2024, 12:42 PM IST
BRS MLAs Press Meet at Telangana Bhavan : రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ సహా సిద్దిపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో రూ.2 లక్షల రుణమాఫీ జరిగింది దమ్ముంటే రాజీనామా చేయ్ అంటూ హోర్డింగ్స్ కనిపించాయి. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధికారపక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్టీ శ్రేణులు పోటా పోటీ నినాదాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు, కేటీఆర్ ఖండించారు. గత పదేళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. ఇప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. మరోవైపు ఉచిత బస్సు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో దుమారమే రేగింది. ఏకంగా మంత్రి సీతక్క దీనిపై స్పందించి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ విషయాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 17, 2024, 12:42 PM IST