కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అభూత కల్పన, అబద్దాల పుట్ట : వేముల ప్రశాంత్ రెడ్డి - Vemula Prashanth on Budget 2024 - VEMULA PRASHANTH ON BUDGET 2024
Published : Jul 25, 2024, 5:59 PM IST
BRS MLA Vemula Prashanth Reddy on State Budget 2024 : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తం అభూత కల్పన, అబద్దాల పుట్టగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ఓట్లను దండుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశించిన ఏ ఒక్క అంశాన్ని బడ్జెట్లో పెట్ట లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ వంచించిందని అన్నారు.
ఎన్నికల హామీల్లో ప్రస్తావించిన అంశాల ఊసే లేదన్న మాజీ మంత్రి, ప్రస్తావించి అంశాలకు ఎంత బడ్జెట్ కేటాయించారో స్పష్టతనే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరిట కుంభకోణానికి తెర లేపారని ఆరోపించారు. దాని ప్రక్షాళనకు బదులుగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చని సూచించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిపై ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు.