LIVE : మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ బృందం - BRS leaders visit Musi river front - BRS LEADERS VISIT MUSI RIVER FRONT
Published : Sep 29, 2024, 10:16 AM IST
|Updated : Sep 29, 2024, 10:41 AM IST
BRS Leaders Visit Musi River Front Live : మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ పర్యటిస్తోంది. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసీ బాధితుల ఇళ్లును వారు పరిశీలిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయపరంగా బాధితుల తరఫున పోరాటం చేస్తామని బృంద సభ్యులు తెలుపుతున్నారు. బాధితుల ఇళ్లను క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బృందం పరిశీలిస్తోంది. ముందుగా హైదర్షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులు బీఆర్ఎస్ నేతలను కలిశారు. ఈ క్రమంలో వారికి మాజీ మంత్రి హరీశ్‌రావు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన సీఎంకు లేదని హరీశ్ రావు విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారంటూ ప్రశ్నించారు. అందుకే బాధితులకు రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ లీగల్ బృందం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిన్న ఇచ్చిన హామీ మేరకు నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తోంది.
Last Updated : Sep 29, 2024, 10:41 AM IST