తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఖమ్మం​లో కేసీఆర్​ బస్సు యాత్ర - ప్రత్యక్ష ప్రసారం - BRS Chief KCR Election Campaign - BRS CHIEF KCR ELECTION CAMPAIGN

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 6:59 PM IST

Updated : Apr 29, 2024, 8:58 PM IST

BRS Chief KCR Election Campaign in Warangal LIVE : బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఖమ్మంలో  పాల్గొన్నారు. వరంగల్ నుండి బస్ యాత్రలో పాల్గొనేందుకు ఆయన ఖమ్మం వచ్చారు. ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కు మద్దుతుగా ప్రచారం చేపట్టారు. ఖమ్మంకు వెళ్లే మార్గంలో వర్ధన్నపేట వద్ద కేసీఅర్ కు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ యాత్ర వర్ధన్న పేట,రాయపర్తి, తొర్రర్, మరిపెడ బంగ్లా మీదుగా ఖమ్మం చేరుకుంది. గత 5 రోజులుగా కేసీఆర్ వివిధ నియోజకవర్గాల్లో బస్ యాత్ర నిర్వహించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలు చేయడం లేదని, రైతులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వేసవిలో కరెంట్ కోత, నీటి ఎద్దడి పెరిగినా కాంగ్రెస్ నేతలు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గులాబీ బాస్ మండిపడుతున్నారు. ఖమ్మంలో నామ నాగేశ్వరరావును గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. 
Last Updated : Apr 29, 2024, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details