తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : దిల్లీలో బీజేపీ లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల - BJP Lok Sabha MANIFESTO - BJP LOK SABHA MANIFESTO

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 8:58 AM IST

Updated : Apr 14, 2024, 10:48 AM IST

BJP Released Manifesto for Lok Sabha Elections in Delhi : వరుసగా మూడోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ, సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప పత్రం పేరుతో ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దాన్ని ఆవిష్కరించారు. ఈరోజు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి ఆదివారమే కావడం గమనార్హం. ‘మోదీ గ్యారంటీ: 2047 నాటికి వికసిత భారత్‌’ అనే ఇతివృత్తంతో అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా బీజేపీ తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రణాళిక తయారీ కోసం రాజ్‌నాథ్‌ నేతృత్వంలో మొత్తం 27 మంది సభ్యులతో కమలదళం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి వచ్చిన దాదాపు 15 లక్షల సూచనలను పరిశీలించి మేనిఫెస్టోకు ఆ కమిటీ రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Last Updated : Apr 14, 2024, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details