LIVE : దిల్లీ నుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ప్రెస్‌మీట్ - BJP MP Laxman Press Meet Live - BJP MP LAXMAN PRESS MEET LIVE
Published : Oct 1, 2024, 3:18 PM IST
BJP MP Laxman Press Meet Live : కేవలం మాటల గారడితోనే కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లదీస్తున్నదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు చిక్కలేదని విమర్శించారు. హరియాణాలో కాంగ్రెస్ పార్టీ 7 హామీలు ఇచ్చిందని, ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీలను రాహుల్‌గాంధీ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలిపారు. రాజస్థాన్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసుల భారీ ఆపరేషన్ రాజస్థాన్‌లో 27 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. జయపూర్, నాగౌర్, జోధ్‌పూర్ జిల్లాల్లో 20రోజుల పాటు పోలీసుల ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. నిందితుల నుంచి భారీగా బ్యాంకు చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారని, నిందితుల నుంచి 31 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఇప్పటివరకు రూ.11 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించామని తెలిపారు. రాజస్థాన్ ముఠా తెలంగాణలో 200కు పైగా సైబర్ నేరాలకు పాల్పడిందని వివరించారు.