స్పెషల్ అట్రాక్షన్‌గా బిహార్ 'గోల్డ్ మ్యాన్' బుల్లెట్- అంతా బంగారమే! - Gold Man Of Bihar - GOLD MAN OF BIHAR
Published : Jun 30, 2024, 3:07 PM IST
Bihar Gold Man Bullet : బంగారంపై ఉన్న ఆసక్తితో బిహార్ గోల్డ్ మ్యాన్‌గా ఫేమస్ అయిన భోజ్పుర్కు చెందిన ప్రేమ్‌సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. శరీరంపైనే కాకుండా తాను తిరిగే బైక్‌ను కూడా బంగారు పూతతో తయారు చేయించారు. బైక్‌లోని కొన్ని భాగాలకు సుమారు 200 గ్రాముల బంగారంతో పూత పూయించినట్లు ప్రేమ్‌సింగ్ చెప్పారు.
''బుల్లెట్ మొత్తం బంగారు పూతతో చేయలేదు. కొన్ని భాగాలకు మాత్రమే బంగారు పూత ఉంటుంది. అందుకోసం 150-200 గ్రాముల బంగారు ఉపయోగించాం. దీని ధర రూ.11 నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఈ బుల్లెట్‌ను బెంగుళూరులో తయారు చేయించాం. అందుకు ఏడు నుంచి ఎనిమిది నెలలు సమయం పట్టింది''
- ప్రేమ్‌సింగ్, బిహార్ గోల్డ్ మ్యాన్
'నేను ధరించే నగలు మాత్రమే కాకుండా కళ్లద్దాలు, మొబైల్ కవర్ ఇలా చాలా వస్తువులు బంగారంతో చేసినవే ఉంటాయి. మొత్తం 5కేజీల పైనే విలువైన బంగారం ఉంటుంది. నేను బయటకు వెళ్లిన నాకు ఎలాంటి భద్రతపరమైన ఇబ్బందులు లేవు' అని ప్రేమ్‌సింగ్ తెలిపారు.