'స్వయంకృషి'తో ఎదిగిన గొప్ప కథానాయకుడు చిరంజీవి - వెంకయ్య తీరు అందరికీ ఆదర్శం : భట్టి విక్రమార్క - Bhatti Speech about Venkaiah Naidu
Published : Feb 4, 2024, 4:06 PM IST
Bhatti Vikramarka Congrats to Padma Awards Winners : పద్మ విభూషన్, పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఒక పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు వెంకయ్యనాయుడని భట్టి విక్రమార్క అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన సభ నడిపిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. తాను చెప్పాలనుకున్న అంశాన్ని వెంకయ్యనాయుడు స్పష్టంగా చెబుతారని పేర్కొన్నారు. ఆయన సభ నడిపిన తీరు అందరికీ ఆదర్శమని ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారని చెప్పారు. సంఖ్యాబలం లేకపోయినా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపైన పోరాడిన ఘనత వెంకయ్యనాయుడికే దక్కుతుందని అన్నారు.
Bhatti Vikramarka about Chiranjeevi : పద్మ విభూషన్ పొందిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, స్వయంకృషితో ఎదిగిన గొప్ప కథానాయకుడని వ్యాఖ్యానించారు. ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం రావడం సంతోషకరమని గుర్తు చేసుకున్నారు. సమాజానికి ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. దేశం గర్వించదగ్గ కథానాయకుడని కొనియాడారు.