LIVE : భద్రాద్రి ఆలయంలో భక్త రామదాసు 391వ జయంతి ఉత్సవాలు - ప్రత్యక్ష ప్రసారం - Rama Dasu birth anniversary
Published : Feb 12, 2024, 9:50 AM IST
|Updated : Feb 12, 2024, 10:22 AM IST
Bhakta Rama Dasu Birth Anniversary Celebrations Live : భద్రాద్రి రామయ్య సన్నిధిలో 391వ భక్తరామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయంలోని భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలతో అర్చకులు అలంకరణ చేశారు. భక్త రామదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షణను ఆలయ అధికారులు, అర్చకులు నిర్వహించారు. భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విశే, కృషి చేసి తన జీవితం మొత్తాన్ని సీతారాముల సేవకు అంకితం చేసిన పరమ భక్తుడు శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలను భద్రాద్రి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్త రామదాసు కీర్తనలు ఆలపించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భద్రాచలానికి సంగీత కళాకారులు కదిలి వచ్చారు. ఆలయంలోని చిత్ర కూట మండపంలో సంగీత కళాకారులు, విధ్వంసులచే భక్త రామదాసు రచించిన కీర్తనలను ఆలపించనున్నారు.