తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిజాం కాలేజ్​ మైదానంలో అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లైవ్​ స్ట్రీమింగ్​ - Ayodya Live Steaming In Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 5:57 PM IST

Ayodya Ram Mandir Live Steaming Bhoomi Puja In Hyderabad : జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర్ ప్రారంభం సందర్భంగా బీజేపీ తరుపున హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్య టేపులు సెట్టింగ్, లైవ్ చూసేందుకు భారీ స్క్రీన్, అన్నదానం ఏర్పాట్లకు సంబంధించి రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ భూమి పూజ చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభం 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవెరబోతుందనిలక్ష్మణ్ తెలిపారు. రామ మందిరం ప్రారంభం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందని పేర్కొన్నారు. 1526లో బాబర్ వచ్చి మందిరాన్ని నేల మట్టం చేశారని లక్నో కోర్టులో విచారణ కోసం 574 పేజీల నివేదిక తయారు చేశారని తెలిపారు. 

MP Laxman Bhoomi Puja : ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో అక్కడ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభం కార్యక్రమంలో మోదీ నిష్ఠ దీక్ష చేస్తూ పాల్గొంటుంటే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం, మైనార్టీలకు వత్తాసు పలకడం కాంగ్రెస్​కి అలవాటేనన్నారు. అందరూ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదని.. అందుకే ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి 2 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు వస్తున్నారని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details