తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE :శ్రీ తేజ్​ను పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రి అల్లుఅర్జున్ - ప్రత్యక్షప్రసారం - ACTOR ALLU ARJUN TO KIMS HOSPITAL

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 10:00 AM IST

Updated : Jan 7, 2025, 2:12 PM IST

Actor Allu Arjun To Kims Hospital LIVE : నటుడు అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్​ను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కిమ్స్​కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్​పేట పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌పై ఉన్నారు.ఆసుపత్రికి రావొద్దు : మరోవైపు సంధ్య థియేటర్​ ఘటనలో గాయపడిన శ్రీ తేజను అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నేపథ్యంలో రాంగోపాల్​పేట పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి రావద్దంటూ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఆసుపత్రికి వస్తే మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందని వివరించారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఆసుపత్రికి వెళ్లలేదు.
Last Updated : Jan 7, 2025, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details