300 అడుగుల బావిలో పడిన మానసిక రోగి- 2 గంటలు శ్రమించి కాపాడిన ఫైర్ సిబ్బంది
Published : Feb 29, 2024, 7:46 AM IST
|Updated : Feb 29, 2024, 8:21 AM IST
A Man Fell Into Well In Karnataka : 300 అడుగుల లోతలైన బావిలో పడిన ఓ మానసిక రోగిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. రెండు గంటల పాటు శ్రమించి ఆ వ్యక్తిని బావిలో నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించారు. ఈ సంఘటన కర్ణాటక ధార్వాడ్ జిల్లాలో జరిగింది.
తర్లఘట్ట గ్రామానికి చెందిన మాలతేశ్ నీల్లప్ప మావనూర(16) మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చి బావిలోకి దూకాడు. పెద్దగా ఏదో శబ్దం రావటం వల్ల స్థానికులు బావి దగ్గరికి వచ్చి చూసేసరికి లోపల మాలతేశ్ కనిపించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మాలతేశ్ను కాపాడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక బుట్టకు తాడు కట్టి బావి లోపలికి వదిలారు. బుట్టులో కూర్చున్న మాలతేశ్ను తాడు సాయంతో బయటకు లాగారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఆ వ్యక్తిని రక్షించారు. బావిలో నీళ్లు ఎక్కువగా లేకపోవటం వల్ల చేతికి, కాలికి స్వల్ప గాయలయ్యాయి. మాలతేశ్ను చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.