Zomato Legends Service Shuts Down:ప్రస్తుత కాలంలో బయట ఫుడ్ తినేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇందుకోసం నేరుగా రెస్టారెంట్లకు వెళ్లకుండా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేందుకు అంతా అలవాటు పడిపోయారు. తీరక లేకుండా పని చేసేవాళ్లు, వండుకునేందుకు సమయం లేక మరికొందరు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే అలాంటి కస్టమర్లకు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో బ్యాడ్ న్యూస్ చెప్పింది. తన ఇంటర్‌సిటీ ఫుడ్ డెలివరీ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు.
కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో- ఇకపై ఆ సర్వీసులు రద్దు! - Zomato Legends Service Shuts Down
Zomato Legends Service Shuts Down: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై తన ఇంటర్‌సిటీ ఫుడ్ డెలివరీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Zomato_Legends_Service_Shuts_Down (ETV Bharat)
Published : Aug 25, 2024, 3:24 PM IST
ఏంటీ ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్?:
- వ్యాపారుల నుంచి పార్సిల్స్ సేకరించి కస్టమర్లకు అందజేయడమే లక్ష్యంగా ఈ ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్ లాంచ్ అయ్యింది.
- దేశవ్యాప్తంగా ఉన్న 10 సిటీల్లోని ఫేమస్ వంటకాలను వివిధ ప్రాంతాలకు డెలివరీ చేస్తారు.
- కస్టమర్ కోరుకున్న రెసిపీస్‌ను 24 గంటల్లో ఒక సిటీ నుంచి మరొక సిటీకి ఫ్లైట్ ద్వారా డోర్ డెలివరీ చేసే వెసులుబాటు ఉంది.
- రాత్రి 7 గంటల లోపు ఆర్డర్ చేస్తే కస్టమర్ కోరుకున్న ఫుడ్‌ని రెస్టారెంట్లో ప్రిపేర్ చేయించి రీయూజబుల్ టాంపర్ ప్రూఫ్ కంటైనర్‌లో ప్యాక్ చేస్తారు.
- కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ పాడవకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం గానీ, ఫ్రీజింగ్ చేయడం గానీ చేయరు.
- మొబైల్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీని వాడి ఫుడ్‌ని పాడవకుండా చూస్తారు. కస్టమర్ ఫుడ్ పార్సిల్‌ని అందుకున్న తర్వాత మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రై, పాన్ ఫ్రై గానీ చేసుకుని వేడి వేడిగా తినొచ్చు.
ఈ సేవలను ఎందుకు నిలిపివేసింది?:
- జొమాటో సంస్థ ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్‌ను 2022లో లాంచ్ చేసింది.
- అయితే ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే కనీసం రూ.5వేల విలువ చేసే ఫుడ్‌ను ఆర్డర్ చేయాలి.
- ప్రారంభంలో కనీస ఆర్డర్ విలువ రూ.5వేలు ఉంటే లాభం ఉంటుందని సంస్థ అనుకుంది.
- కానీ ఇది ఆశించినంత మేర ఫలితాలను ఇవ్వలేదు. అంత మొత్తంలో విలువైన ఆర్డర్స్ రాలేదు.
- దీంతో ఈ సర్వీస్‌ను ఏప్రిల్ నుంచి కొన్నాళ్లు హోల్డ్‌లో పెట్టిన సంస్థ మళ్లీ ఇటీవలే జులైలో తిరిగి ప్రారంభించింది.
- అయినప్పటికీ దీనివల్ల లాభాలు లేకపోవటంతో మొత్తానికే ఈ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.