Youtube Premium Subscription Prices: భారత్‌లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరలను పెంచేసింది. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్లతో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని 58శాతం పెంచేస్తూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొత్త ధరలు కంపెనీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వినియోగదారులకు వీటికి సంబంధించి ఇ-మెయిల్స్ పంపడం ప్రారంభించింది.
ఏంటీ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్?:
- యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు యాడ్స్ లేకుండా కంటెంట్ చూడొచ్చు.
- 1080pలో అధిక బిట్రేట్ స్ట్రీమింగ్, ఆఫ్‌లైన్ డౌన్లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్‌లో యాడ్స్ లేకుండా చూడొచ్చు.
- ఇలా పలు రకాల ప్రయోజనాలను సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు పొందొచ్చు.
ఎందుకు ధరలు పెంచింది?:
- యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబుల్ యాడ్స్ ఆప్షన్‌ను చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది.
- యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచడం, తగ్గించడం చేస్తోంది.
- తాజాగా సబ్స్క్రిప్షన్ ధరలను పెంచింది.
పెంచిన కొత్త ధరలు వివరాలు ఇలా:
- వ్యక్తిగత ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర:యూట్యూబ్ వ్యక్తిగత ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.149గా నిర్ణయించింది. ఇంతకు ముందు దీని ధర రూ.129గా ఉండేది.
- ఫ్యామిలీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర:గతంలో రూ.189గా ఉన్న ఈ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. ఫ్యామిలీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ఈ ప్రయోజనాలు పొందొచ్చు.
- స్టూడెంట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర:ఇక ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెంచింది.
- వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారి ప్లాన్ ధర:వ్యక్తిగత ప్రీపెయిడ్ ప్లాన్ ధర నెలకు రూ.159కి సవరించింది. గతంలో ఈ ధర కేవలం రూ.139గా ఉండేది.
- వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధర: ఇక వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధరను రూ.399 నుంచి రూ.459కి సవరించింది.
- వ్యక్తిగత వార్షిక ప్లాన్ ధర: గతంలో రూ.1290 ఉన్న దీని ధరను రూ.1490కి పెంచింది. అంటే ఏకంగా రూ.200 అధికంగా పెంచేసింది.
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్ - iphone 16 launch date
దిమ్మతిరిగే ఫీచర్లతో 'టీవీఎస్ జూపిటర్ 110'- ధర ఎంతంటే? - TVS Jupiter 110 Launched
ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవటం ఎలా?- ఈజీ ప్రాసెస్ ఇదే! - Aadhaar Card Free Update