Youtube Shopping Affiliate Programme:ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అత్యధిక ప్రజాదరణతో దూసుకుపోతోంది. తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు చాలామంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్‌లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ తెచ్చింది.
కంటెంట్ క్రియేటర్ల వారి ఆదాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా 'యూట్యూబ్ షాఫింగ్ అఫీలియేటెడ్ ప్రోగ్రామ్' అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో క్రియేటర్స్ తమ వీడియోస్‌లో ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేసి మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం దీనికోసం మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
యాక్సెస్ చేసుకోవడం ఎలా?:ఈ కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వీడియో క్రియేటర్స్ యూట్యూబ్‌షాపింగ్‌లో సైనప్ అవ్వాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్‌ను యూట్యూబ్ ఆమోదించాక ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లో ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేయొచ్చు.
ఇలా ప్రమోట్ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్ అందుతుందని యూట్యూబ్ తెలిపింది. ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేసే సమయంలోనే కమీషన్ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. అంతేకాక కంటెంట్ క్రియేటర్స్ ఒక వీడియోకు దాదాపు 30 ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేయొచ్చని యూట్యూబ్ తెలిపింది.