Whatsapp Chat Recording Feature:ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ మెటా ఏఐతో షేర్ చేసిన పర్సనల్ డేటాను రికార్డ్ చేసేందుకు ఉపయోగపడనుంది. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారం, సూచనలను ఇవ్వనుంది. ఈ మేరకు వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్‌పై పనిచేస్తోందని WABeta నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది ప్రారంభంలో మెటా.. వాట్సాప్‌కు మెటా ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తర్వాత ఈ గో-టు మెసెంజర్ యాప్ దాన్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు పని చేస్తోంది. ఈ క్రమంలో వాట్సాప్ చాట్ మెమరీ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. వ్యక్తిగత సహాయాన్ని మెరుగ్గా వ్యక్తిగతీకరించడం, Meta AIకి పంపించిన అవసరమైన ఇన్ఫర్మేషన్ను రికార్డ్ చేయటమే ఈ ఫీచర్ లక్ష్యం. ఉదాహరణకు మీరు వెజిటేరియన్ అని చాట్ అసిస్టెంట్‌కు తెలిస్తే దానికి అనుగుణంగా అది రెసిపీస్‌ను షేర్ చేస్తుంది.
చాట్‌బాట్‌తో గతంలో షేర్ చేసిన వివరాలను ఆటోమెటిక్‌గా గుర్తుచేసేందుకు ఏఐని మెటా అనుమతిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు వారి ప్రాధాన్యతల గురించి Meta AI ద్వారా స్టోర్ చేసిన సమాచారం ఆధారంగా మరింత సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. వెజిటేరియన్, బర్త్‌డే, పర్సనల్ ప్రిఫెరెన్స్, ఫార్మల్ టోన్ ఆఫ్ కాన్వర్జెషన్ వంటి వాటితో సహా వ్యక్తిగత వివరాలను ఏఐ గుర్తుంచుకోగలదు. అదనంగా ఇది ఫేవరెట్ బుక్స్, డాక్యుమెంటరీస్, పాడ్‌క్యాస్ట్‌ల వంటి వాటితో సహా అలెర్జీస్, ఆసక్తులను ట్రాక్ చేస్తుంది.