WhatsApp In-App Dialer : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ తమ యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా త్వరలో ఇన్-యాప్ డైలర్‌ను కూడా తీసుకువస్తోంది. అంటే ఇకపై మీరు ట్రూకాలర్, గూగుల్ డైలర్ లాంటివి వాడకుండా, నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేయవచ్చు.
ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా ఎవరికైనా కాల్ చేయాలంటే, ఆ నంబర్ మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండి తీరాలి. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ ఇన్-యాప్ డైలర్ అందుబాటులోకి వస్తే, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్‌కు సైతం కాల్ చేయడానికి వీలవుతుంది.
పూర్తిగా సురక్షితం!
ప్రస్తుతానికి వాట్సాప్ ఇన్-యాప్ డైలర్ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.9.28లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీనిని అందరు యూజర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. చాలా మంది యూజర్లు వాట్సాప్ ద్వారా మాత్రమే ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కాల్స్ చేసేటప్పుడు వాట్సాప్ వాడుతుంటారు. నెట్‌వర్క్ ప్రోబ్లమ్ లేకుండా ఉండేందుకు, తక్కువ ఖర్చులో కాల్ చేసేందుకు ఇలా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది మరింత భద్రం కానుంది. వాట్సాప్ ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉంటాయి. కనుక యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని వాట్సాప్ చెబుతోంది.
ఇంటర్నెట్ లేకున్నా ఫైల్ షేరింగ్
ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఇకపై నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా మీ డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు.