ETV Bharat / technology

డోంట్​ మిస్ లక్కీ ఛాన్స్: సెల్ఫీ కొట్టు- 24 క్యారెట్ 'సోనా' స్కూటర్ పట్టు- కస్టమర్లకు ఓలా బంపర్ ఆఫర్! - OLA S1 PRO SONA EDITION

గోల్డ్ డిజైన్​తో ఓలా 'ఎస్1 ప్రో' లిమిటెడ్ ఎడిషన్- సెల్ఫీతో స్కూటర్​ గెలుచుకునే అవకాశం!

Ola S1 Pro Sona Edition
Ola S1 Pro Sona Edition (Photo Credit- Instagram/Ola Electric)
author img

By ETV Bharat Tech Team

Published : 11 hours ago

Updated : 11 hours ago

Ola S1 Pro Sona Edition: ఇండియాలో లీడింగ్ టూ-వీలర్ ఈవీ తయారీ సంస్థ ఓలా తన 'ఎస్1 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్​ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్​ వేరియంట్​ను 'సోనా' పేరుతో తీసుకొచ్చింది. పేరుకు తగినట్లుగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని చాలా వరకు ఎలిమెంట్స్​ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్​తో తయారు చేశారు.

ఈ సరికొత్త 'ఓలా S1 ప్రో సోనా' ఎన్ని లిమిటెడ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయనే దానిపై కంపెనీ ఇంకా సమాచారం అందించలేదు. అయితే ఓలా ఈ కొత్త సోనా ఎడిషన్ కోసం కాంపిటీషన్​ను నిర్వహిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. తన సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ న్యూ మార్కెటింగ్ క్యాంపైన్​ను రన్​ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ సోనా ఎలక్ట్రిక్​ను లాంఛ్ చేసి పోటీ నిర్వహిస్తోంది.

ఫీచర్లు: ఈ ఓలా S1 ప్రో సోనా స్కూటర్​ను ప్రత్యేకమైన కలర్​లో తీసుకొచ్చారు. దీన్ని పెర్ల్ వైట్, గోల్డ్ మిక్స్డ్ కలర్​లో స్టన్నింగ్ లుక్​లో డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. రియర్ ఫుట్​పెగ్, గ్రాబ్ రైల్, బ్రేక్ లివర్, మిర్రర్ స్టాక్ వంటి అనేక యూనిట్లను 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. ఈ స్కూటర్​ సీటును డార్క్​ బ్రైట్​ నప్పా లెదర్​లో జరీ థ్రెడ్ ఉపయోగించి గోల్డ్ థ్రెడ్​తో స్టిచ్చింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ సీటు ప్రీమియం లుక్​లో కన్పిస్తుంది.

అంతేకాక ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్​లో మరింత పర్సనలైజ్​డ్​ ఎక్స్​పీరియన్స్​ కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్​వేర్ కూడా ఉంటుంది. ఈ మోడల్​లో గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్​ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్​బోర్డ్​ వంటివి ఉన్నాయి. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్​ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఉన్నాయి.

స్కూటర్ సొంతం చేసుకోండిలా!: ఓలా తన సేల్స్ పెంచుకునేందుకు క్యాంపైన్​లో భాగంగా ఈ స్కూటర్​పై కాంపిటీషన్​ను నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే వారు 'Ola S1 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇన్​స్టా రీల్ పోస్ట్ చేయాలి. లేదా ఓలా స్టోర్ వెలుపల ఫొటో లేదా సెల్ఫీని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫొటోలు లేదా వీడియోలను #OlaSonaContest అనే హ్యాష్​ట్యాగ్​తో 'Ola Electric'కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలి. ఇలా లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్​ని గెలుచుకునే అవకాశం పొందొచ్చు. ఈ పోటీ ఓలా స్టోర్స్ వద్ద డిసెంబర్ 25 అంటే ఇవాళే జరగనుంది.

ఒకేసారి ఏకంగా 3200 స్టోర్ల ఓపెనింగ్: ఓలా ఎలక్ట్రిక్‌ తన రిటైల్‌ స్టోర్లను అమాంతం పెంచేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఒకేరోజు 3,200 స్టోర్లను భారీ స్థాయిలో ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను ఒకేసారి ఏకంగా 4,000కు పెంచనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అనుకున్నట్లుగానే కంపెనీ ఇవాళ భారీ ఎత్తున ఒకేసారి 3,200 స్టోర్లను ప్రారంభించింది.

ప్రస్తుతం ఉన్న తమ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని 4,000కు పెంచడంపై ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో, టైర్‌ 2, టైర్‌ 3 నగరాలతో పాటు చిన్న పట్టణాలు, మండల కేంద్రాలకూ తమ సర్వీస్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఓలా స్కూటర్‌పై అందిస్తున్న ఆఫర్లను ప్రకటించారు. ఓలా 'ఎస్‌1' పోర్ట్‌ఫోలియోలోని స్కూటర్లపై రూ.25వేల విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తమ నెట్​వర్క్​ను ఒకేసారి పెద్ద ఎత్తున విస్తరించిన సందర్భంగా ఈ ఆఫర్​ను అందిస్తున్నట్లు పేర్కొంది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మార్కెట్‌ నంబర్​ వన్​గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌పై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సేల్స్ అనంతరం కస్టమర్లకు సేవలను అందించే విషయంలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వినియోగదారులు హెల్ప్‌లైన్‌కు 10 వేలకు పైనే ఫిర్యాదులు రావడం, దీనిపై సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (CCPA) విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

50MP కెమెరా, 5500mAh బ్యాటరీ.. వివో కొత్త 5G ఫోన్ ఏముంది భయ్యా.. రూ. 12,999లకే!

ఈ న్యూఇయర్​లో మంచి రీఛార్జ్ ప్లాన్​ కోసం చూస్తున్నారా?- రూ.500లోపు బెస్ట్ ప్యాక్స్ ఇవే..!

Last Updated : 11 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.