Best Prepaid Plans for New Year: మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. మీ ప్రీపెయిడ్ మొబైల్ కోసం మంచి ప్లాన్‌ను ఎంచుకునేందుకు ఇదే మంచి సమయం. ఎందుకంటే కొత్త సంవత్సరం నేపథ్యంలో చాలావరకు టెలికాం కంపెనీలు అదిరే ఆఫర్లతో సరికొత్త ప్లాన్లను తీసుకొస్తుంటాయి. ఈ సందర్భంగా వాటిలో రూ.500 కంటే తక్కువ బడ్జెట్లో ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసం.
1. BSNL Rs. 485 ప్లాన్: లాంగ్ వ్యాలిడిటీ అండ్ డైలీ బెనిఫిట్స్
- వాయిస్ కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
- డేటా: రోజుకి 1.5GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది)
- SMS: రోజుకి 100 SMS
- వ్యాలిడిటీ: 82 డేస్
- ఎక్స్ట్రా బెనిఫిట్స్: ఫ్రీ కాలర్ ట్యూన్స్
తరచుగా రీఛార్జ్‌లు చేసేపని లేకుండా ఎక్కువ కాలం పాటు స్థిరమైన డేటా, కాల్ సర్వీసులు అవసరమయ్యే యూజర్లకు ఈ BSNL ప్లాన్ బాగుంటుంది.
2. AirTel Rs 379 రీఛార్జ్ ప్యాక్: హై-స్పీడ్ డేటా విత్ అన్లిమిటెడ్ 5G
హై-స్పీడ్ డేటా కావాలనుకునే వారికి ఈ ఎయిర్‌టెల్ రూ. 379 ప్రీపెయిడ్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్.
- వాయిస్ కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
- డెటా: రోజుకి 2GB + అన్లిమిటెడ్ 5G డేటా (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
- SMS: రోజుకి 100 SMS
- వ్యాలిడిటీ: 1 నెల
- ఎక్స్ట్రా బెనిఫిట్స్: ఫ్రీ కాలర్ ట్యూన్స్
ఈ ప్లాన్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇది వర్క్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ డేటాను ఉపయోగించే వారికి బాగా ఉపయోగపడుతుంది.
3. Vodafone Idea Rs 365 ప్యాక్: ఫ్లెక్సిబుల్ డేటా అండ్ నైట్ బెనిఫిట్స్
వొడాఫోన్ ఐడియా ఈ రూ. 365 ప్లాన్ వినియోగదారులకు అదనపు సౌలభ్యం, బోనస్ డేటాను అందిస్తుంది.
- వాయిస్ కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
- డేటా: రోజుకు 2GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
- SMS: రోజుకు 100 SMS
- వ్యాలిడిటీ: 28 రోజులు
- ఎక్స్ట్రా బెనిఫిట్స్: 12am నుంచి 12am వరకు అన్లిమిటెడ్ డేటా, వారాంతపు రోజులలో ఉపయోగించని డేటా కోసం వారాంతపు రోల్‌ఓవర్, అదనపు ఖర్చు లేకుండా నెలకు 2GB బ్యాకప్ డేటా.
ఈ ప్లాన్ ఎక్కువగా నైట్ టైమ్ డేటా వినియోగించే వారికి పర్ఫెక్ట్గా ఉంటుంది.
4. Jio Rs.449 ప్యాక్:
జియో రూ. 449 ప్లాన్ ఎక్కువ డేటా వినియోగం, ప్రయాణంలో వినోదం కోరుకునే వారి కోసం తీసుకొచ్చారు.
- వాయిస్ కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
- డేటా: రోజుకు 3GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
- SMS: రోజుకు 100 SMS
- వ్యాలిడిటీ: 28 రోజులు
- ఎక్స్ట్రా బెనిఫిట్స్: JioTV, JioCinema, JioCloud యాక్సెస్‌తో పాటు Jio 5G కవరేజీ ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5G డేటా.
తరచూ వీడియోలను స్ట్రీమ్ చేసే, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే లేదా వీడియో కాల్స్‌లో పాల్గొనే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బాగుంటుంది. దీంతోపాటు జియో నెట్‌వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్‌లను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.
5. AirTel Rs.398 ప్యాక్: స్పోర్ట్ లవర్స్ ఈ ప్లాన్‌ను ఎంతగానో ఇష్టపడతారు. ఎయిర్‌టెల్ ఈ రూ. 398 ప్లాన్‌లో పుష్కలమైన డేటా ప్రయోజనాలతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఇది స్పోర్ట్స్ లవర్స్‌తో పాటు ఎక్కువగా ప్రీమియం కంటెంట్ చూసేవారికి బాగా ఉపయోగపడుతుంది.
- వాయిస్ కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
- డేటా: రోజుకి 2GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
- SMS: రోజుకి 100 SMS
- వ్యాలిడిటీ: 28 రోజులు
- ఎక్స్ట్రా బెనిఫిట్స్: Disney+ Hotstarకి 28-రోజుల సబ్‌స్క్రిప్షన్
స్పోర్ట్ లైవ్ స్ట్రీమ్ లవర్స్, డేటా లిమిట్స్ చింత లేకుండా ఇతర ప్రీమియం కంటెంట్ చూడాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.
BSNL కొత్త ఇంటర్నెట్ టీవీ సర్వీస్ లాంఛ్- ఇకపై ఉచితంగానే హై క్వాలిటీ ఓటీటీ కంటెంట్!
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?- మరికొన్ని రోజుల్లో వాటిలో వాట్సాప్ బంద్!