Whatsapp DP Screenshot : తమ వినియోగదారుల భద్రత, గోప్యత విషయంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో పలు కీలక అప్డేట్లు, ఫీచర్లను వాట్సాప్ అప్లికేషన్లో తీసుకువచ్చింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు సిద్ధమయింది వాట్సాప్. త్వరలో రానున్న ఈ నయా ఫీచర్ దాదాపు చాలామందికి వ్యక్తిగత భద్రతతో పాటు అనేక విధాలుగా ఉపయోగపడనుంది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటంటే?
'స్క్రీన్‌షాట్ బ్లాక్' ఫీచర్
Whatsapp New Features 2024 :వాట్సాప్ యూజర్స్ తమ వాట్సాప్ అకౌంట్లో డీపీ లేదా ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు. చాలా వరకు అది తమ సెల్ఫీ లేదా రెగ్యులర్ ఫొటో అయ్యుంటుంది. దీనిని ఇతరులు స్క్రీన్‌షాట్ తీసి, తప్పుడు పనులకు వాడుకోవచ్చు. అందుకే ఇకపై యూజర్ ప్రొఫైల్ పిక్‌ను, ఇతరులు స్క్రీన్‌షాట్ తీయడానికి వీలులేకుండా ఓ నయా ఫీచర్‌ను తీసుకువస్తోంది వాట్సాప్. కప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా టెస్టర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. టెస్టింగ్ పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా సాధారణ వినియోగదారులు అందరికీ దీనిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ఎవరైనా మీ డీపీని స్క్రీన్‌షాట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే 'Can't Take A Screenshot Due To App Restrictions' అనే సందేశం వస్తుంది. వాస్తవానికి ఇలాంటి వార్నింగ్ మెసేజ్‌లు ఇప్పటికే స్నాప్‌చాట్, పేటీఎం, గూగుల్ పే లాంటి ఇతర యాప్స్‌లో కనిపిస్తుంటాయి.
శతకోటి ఉపాయాలకు అనంత కోటి --
వాట్సాప్ తేనున్న ఈ డీపీ స్క్రీన్‌షాట్ బ్లాక్ ఫీచర్‌తో, ప్రొఫైల్ పిక్చర్లను స్క్రీన్‌షాట్ అయితే తీయలేరు. కానీ మరో సెల్‌ఫోన్ లేదా కెమెరా ఉపయోగించి వాట్సాప్ డీపీని ఫొటో తీసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే అంతకుముందు వాట్సాప్‌లో ప్రొఫైల్ పిక్‌ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. అయితే ఆ ఫీచర్‌ను 2019లోనే తొలగించింది వాట్సాప్.