Vivo Y29 5G:న్యూఇయర్ వేళ వివో నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. 'వివో Y29 5G' పేరుతో కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఇది మూడు కలర్ ఆప్షన్స్, నాలుగు వేరియంట్లలో దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. వివో ఈ మొబైల్‌పై ప్రారంభ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ కొత్త 'వివో Y29 5G' స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్లు, ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
'వివో Y29 5G' ఫీచర్లు:
- డిస్‌ప్లే:6.68 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ
- రిఫ్రెష్ రేటు:120Hz
- పీక్ బ్రైట్‌నెస్:1,000 నిట్స్
- బ్యాటరీ: 5,500mAh
- మెయిన్ కెమెరా: 50ఎంపీ
- ఫ్రంట్ కెమెరా:8ఎంపీ
- 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- IP64 రేటింగ్
'వివో Y29 5G' కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.4
- యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్
- 3.5mm ఆడియో జాక్
ఈ కొత్త 'వివో Y29 5G' ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో వస్తోంది. ఇది 6nm ఆక్టా- కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoCతో పనిచేస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డ్ సాయంతో 1TB వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. 79 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
'వివో Y29 5G' వేరియంట్స్:
- 4GB +128GB వేరియంట్
- 6GB +128GB వేరియంట్
- 8GB +128GB వేరియంట్
- 8GB + 256GB వేరియంట్