తెలంగాణ

telangana

ETV Bharat / technology

ట్రూకాలర్ నయా కాల్ రికార్డింగ్​ ఫీచర్ - రియల్​ టైమ్​లో ట్రాన్స్​క్రిప్షన్, కాల్ సమ్మరీ - Truecaller latest features

Truecaller AI Powered Call Recording Feature : ట్రూకాలర్ యూజర్లకు గుడ్ న్యూస్​. ట్రూకాలర్ తమ​ ప్రీమియం సబ్​స్క్రైబర్ల కోసం ఏఐ పవర్డ్ కాల్ రికార్డింగ్ ఫీచర్​ను తీసుకువచ్చింది. దీనిని ఉపయోగించి రియల్​ టైమ్​లో ఇన్​కమింగ్, అవుట్​ గోయింగ్​ కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ట్రాన్స్​క్రిప్షన్ కూడా పొందవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

Truecaller call recording feature
Truecaller AI powered call recording feature

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 5:41 PM IST

Updated : Feb 26, 2024, 8:15 PM IST

Truecaller AI Powered Call Recording Feature : స్వీడన్ దేశానికి చెందిన కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్​ 'ట్రూకాలర్​' సోమవారం భారత దేశంలో 'ఏఐ పవర్డ్ కాల్ రికార్డింగ్' ఫీచర్​ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని వల్ల యూజర్లు ఇన్​కమింగ్, అవుట్​ గోయింగ్ కాల్స్​ను యాప్​లోనే రికార్డ్ (Truecaller call recording feature) చేసుకోవచ్చని పేర్కొంది.

ప్రీమియం సబ్​స్క్రైబర్లకు మాత్రమే!
ఈ కాల్​ రికార్డింగ్​ ఫీచర్​ పూర్తిగా పెయిడ్​ సర్వీస్​. ట్రూకాలర్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ ఫీచర్​ను ఉపయోగించగలరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​తో పనిచేసే ఈ కాల్ రికార్డింగ్​ ఫీచర్​ - ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ డివైజులు అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది. కనుక యూజర్లు తమకు వచ్చిన ఇన్​కమింగ్ కాల్స్​ను, తాము చేసే అవుట్​గోయింగ్ కాల్స్​ను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాదు డిటైల్డ్ నోట్స్ (ట్రాన్స్​క్రిప్షన్​)​ కూడా పొందవచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్, హిందీ భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఈ ప్రీమియం ఫీచర్​ ధర ఎంత?
ఈ ఏఐ పవర్డ్​ కాల్​ రికార్డింగ్ ఫీచర్​ అనేది ట్రూకాలర్ ప్రీమియం ప్లాన్​ తీసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రీమియం ప్లాన్ ధర నెలకు అయితే రూ.75 ఉంటుంది. సంవత్సరానికి అయితే రూ.529 ఉంటుంది.

ఆటోమెటిక్​ కాల్ ఆన్సర్​- అవతలి వ్యక్తి మాటలు మీ స్క్రీన్​పై టెక్స్ట్ రూపంలో
Truecaller Assistant India :ఇటీవలె భారతీయ యూజర్ల కోసం ట్రూ కాలర్ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ట్రూకాలర్ అసిస్టెంట్​ పేరుతో ఈ ఫీచర్​ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్​తో మన కాంటాక్ట్​ లిస్ట్​లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు, వారి వివరాలను తెలియజేస్తుంది. ఫోన్​ రింగ్​ అవడానికి ముందే ఎవరు కాల్​ చేస్తున్నారో చెప్పేస్తుంది​​. భారత్​లో ట్రూకాలర్ ​యాప్​లో ఫ్రాడ్​, స్పామ్ కాల్స్​ను నిలువరించేందుకు ట్రూకాలర్అసిస్టెంట్​ అనే ఈ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ట్రూకాలర్ అసిస్టెంట్ ఫీచర్ ప్రత్యేకతేంటో? ఈ ఫీచర్ ఎవరికి అందుబాటులోకి వచ్చిందో? తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Feb 26, 2024, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details