Top 10 Power Banks With 10000 mAh Capacity : ఫోన్స్, స్మార్ట్‌వాచెస్ లాంటి గ్యాడ్జెట్స్ మన జీవితంలో భాగమయిపోయాయి. ఇవి లేకుండా మనం జీవించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకే మనం ఎక్కడికి వెళ్లినా, వాటిని వెంట తీసుకెళుతూ ఉంటాం. ముఖ్యంగా దూరప్రయాణాలు చేసేటప్పుడు, అవి మన దగ్గర ఉండాల్సిందే. అయితే అలాంటి సమయాల్లో వాటికి ఛార్జింగ్ పెట్టడమే పెద్ద సమస్య అవుతుంది. అందుకే పవర్ బ్యాంకులను కొంటూ ఉంటాం.
హై-కెపాసిటీ ఉండాల్సిందే!
పవర్ బ్యాంక్‌లు డిఫరెంట్ కెపాసిటీల్లో లభిస్తాయి. సాధారణ అవసరాలకు తక్కువ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ సరిపోతుంది. కానీ దూర ప్రయాణాలు చేసేవారు, తరచూ ప్రయాణాలు చేసేవారు హై-కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకులు తీసుకోవడం మంచిది. అందుకే ఈ ఆర్టికల్‌లో 10000 mAh కెపాసిటీ ఉన్న టాప్-10 పవర్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
10. Anker Apple Power Bank : యాంకర్ యాపిల్ ఎంఫై సర్టిఫైడ్ మెగ్‌సేఫ్ పవర్ బ్యాంక్‌ను ప్రత్యేకంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్‌ల కోసం రూపొందించారు. ఇది మాగో పోర్టబుల్ 20 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, మాగ్నెటిక్ వైర్లెస్ డిజైన్‌తో వస్తుంది.
Anker Power Bank Specs :
- బ్రాండ్ : యాంకర్
- కెపాసిటీ : 10,000 mAh
- పోర్ట్స్ : యూఎస్బీ-ఏ, యూఎస్బీ-సీ
- ఫీచర్స్ : 20 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, మాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్, ఆల్ట్రా స్లిమ్ డిజైన్
9. Portronics Luxcell Power Bank : ఈ పోర్ట్రోనిక్స్ లక్స్సెల్ పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్‌పుట్ ఇస్తుంది. దీనిలో డ్యూయెల్ పోర్టులు ఉంటాయి. దీనికి BIS సర్టిఫికేషన్ చిప్ ప్రొటక్షన్ గ్యారెంటీ ఉంది.
Portronics Luxcell Power Bank Specs :
- బ్రాండ్ : పోర్ట్రోనిక్స్
- కెపాసిటీ : 10,000 mAh
- పోర్ట్స్ :యూఎస్బీ-ఏ, 2 x యూఎస్బీ-సీ
- ఫీచర్స్ : ఎల్ఈడీ బ్యాటరీ ఇండికేటర్, కాంపాక్ట్ డిజైన్, టైప్-సీతో సహా టైప్-సీ కేబుల్ కూడా దీనిలో ఉంటాయి.
8. Belkin Power Bank : ఈ బెల్కిన్ పవర్ బ్యాంక్ 15 వాట్ పీడీ 3.0 టెక్నాలజీతో వస్తుంది. దీనితో ఒకేసారి 3 డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు సహా వివిధ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 40 గంటల ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీనిలో 2 టైప్-ఏ, 1 టైప్-సీ పోర్టులు ఉంటాయి.
Belkin Power Bank Specs :
- బ్రాండ్ : బెల్కిన్
- కెపాసిటీ : 10,000 mAh
- పోర్ట్స్ : 2 యూఎస్బీ-ఏ, 1 యూఎస్బీ-సీ
- ఫీచర్స్ : 15 వాట్ పీడీ 3.0 టెక్నాలజీ, ఎల్ఈడీ ఇండికేటర్
7. Redmi Power Bank : ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. దీనిలో డబుల్ యూఎస్బీ పోర్టులు ఉంటాయి.
Redmi Power Bank Specs :
- బ్రాండ్ :రెడ్మీ
- కెపాసిటీ : 10,000 mAh
- పోర్ట్స్ :డ్యూయెల్ యూఎస్బీ అవుట్‌పుట్ (మైక్రో యూఎస్బీ & టైప్-సీ)
-
ఫీచర్స్ : 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
6. Spigen 2in1 Wireless Charging Power Bank : స్పిజెన్ పవర్ బ్యాంక్ వివిధ ఛార్జింగ్ ఆప్షన్లతో వస్తుంది. ముఖ్యంగా యూఎస్బీ-ఏ, యూఎస్బీ-సీల ద్వారా 20వాట్ కెపాసిటీతో ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. వైర్‌లెస్‌గా అయితే 15 వాట్ కెపాసిటీతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే దీనితో స్మార్ట్‌వాచ్‌లను, dockలను ఛార్జింగ్ చేయలేము.
Spigen Power Bank Specs :
- బ్రాండ్ : స్పిజెన్
- కెపాసిటీ : 10,000 mAh
- పోర్ట్స్ :యూఎస్బీ-ఏ, యూఎస్బీ-సీ
-
ఫీచర్స్ : వైర్లెస్ ఛార్జింగ్ అప్టూ 15 వాట్, యూఎస్బీ-సీ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్