Smartphone Safety Tips :ఫోన్ పోగొట్టుకోవడం సాధారణ విషయంగా మారిపోయింది. కొందరు నిర్లక్ష్యంగా ఫోన్ కోల్పోతే.. మరికొందరి నుంచి దొంగలు చాకచక్యంగా కొట్టేస్తారు. ఫోన్ మన చేతి నుంచి పోయిందంటే.. ఇక దానిమీద చాలా వరకు ఆశలు వదిలేసుకోవడమే. ఫోన్ తిరిగి దక్కించుకోవడానికి కొన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వంద శాతం సక్సెస్ రేటు లేదు. అయితే.. ఆ మార్గాలతోపాటు మీ ఫోన్ సెట్టింగ్స్‌లో చిన్న మార్పు చేయడం ద్వారా ఈజీగా మీ మొబైల్‌ను కనిపెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు!
ఫోన్‌ను పొరపాటున చేజార్చుకున్నా.. దొంగలు కొట్టేసినా.. వారు చేసే మొదటి పని దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం. ఆ తర్వాత ఫోన్లో ఉన్న సిమ్‌ను కార్డును తీసేసి కొత్త సిమ్ వేసి వాడుకుంటూ ఉంటారు. లేదంటే.. తక్కువ ధరల్లో ఎవరో ఒకరికి అమ్మేసుకుంటారు. అయితే.. ఫోన్ పోయిన తర్వాత దొరకబట్టడానికి కొన్ని మార్గాలు వచ్చాయి. Central Equipment Identity Register (CEIR) వంటివి అమల్లోకి వచ్చాయి. అయితే, ఫోన్ దొంగిలించిన వారు.. అసలు ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకుండా చేయడం ద్వారా.. మరింత త్వరగా దాన్ని కనిపెట్టే ఛాన్స్ ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం.. ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ చేస్తే సరిపోతుందని అంటున్నారు.
ఈ సెట్టింగ్ మార్చడం ద్వారా.. ఫోన్ ఆన్ చేయడానికి మీ పాస్వర్డ్ ఎలాగైతే ఎంటర్ చేయాలో.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్ వర్డ్ ఏంటో వారికి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేయలేరు. మరి ఇందుకోసం సెట్టింగ్స్‌లో ఎలాంటి ఛేంజెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం.