తెలంగాణ

telangana

ETV Bharat / technology

YouTubeలో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకు ఎంత రెవెన్యూ వచ్చిందో తెలుసా? - The First Youtube Video - THE FIRST YOUTUBE VIDEO

The First Youtube Video : యూట్యూబ్​లో కోట్లాది వీడియోలు ఉంటాయి. కానీ యూట్యూబ్​లో అప్​లోడ్ చేసిన మొదటి వీడియో ఏది? ఆ వీడియోను ఎవరు అప్​లోడ్ చేశారు? దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి? మొత్తంగా దానికి ఎంత రెవెన్యూ వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

YOUTUBE CO FOUNDERS
first youtube video (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 11:34 AM IST

The First Youtube Video :ప్రపంచంలోనివీడియో ప్లాట్​ఫామ్స్​ అన్నింటిలో, యూట్యూబ్​కు ఉన్నంత క్రేజ్ మరిదేనికీ లేదంటే, అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. చిన్న విషయం నుంచి బుర్రకు అర్థంకాని ఎన్నో అంశాలకు సంబంధించిన వీడియోలకు అడ్డా 'యూట్యూబ్'. అంతేకాకుండా తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు, చాలా మంది క్రియేటర్లు యూట్యూబ్​ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్​లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే యూట్యూబ్​లో తొలి వీడియోను ఎవరు? ఎక్కడ? ఎప్పుడు అప్​లోడ్ చేశారు? దానికి ఇప్పటి వరకు ఎంత రెవెన్యూ వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫస్ట్ వీడియో ఇదే!
యూట్యూబ్​లో మొదటి వీడియోను ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ 2005 ఏప్రిల్ 24న అప్​లోడ్ చేశారు. అమెరికాలోని సాన్​ డియాగో జూలో 'మీ ఎట్ ది జూ' పేరుతో ఏనుగుల ఎదురుగా నిలబడిన వీడియోను యూట్యాబ్​లో అప్​లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆయన ఏనుగుల గురించి సరదాగా ప్రేక్షకులకు చెప్పారు. ఈ వీడియో నిడివి 19 సెకన్లు మాత్రమే. 19 ఏళ్ల క్రితం అప్​లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 322 మిలియన్లకు పైగా వ్యూస్​ పొందింది. అలాగే ఈ వీడియోను అప్​లోడ్ చేసిన జావెద్ కరీమ్ యూట్యూబ్ ఛానెల్​కు ప్రస్తుతం 4.72 మిలియన్ల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. అయితే జావెద్ కరీమ్ తన యూట్యూబ్ ఛానల్​లో అప్లోడ్ చేసిన ఫస్ట్ అండ్​ లాస్ట్ వీడియో ఇదే కావడం గమనార్హం.

రెవెన్యూ ఎంత వచ్చింది?
జావెద్ కరీమ్ అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ఇంతలా వ్యూస్ రావడం వల్ల భారీగా డబ్బులు వచ్చాయని మీరు అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ వీడియో అప్​లోడ్ చేసేనాటికి యూట్యూబ్ మానిటైజేషన్ ప్రారంభించలేదు. కనుక ఆ ఫస్ట్​ వీడియోపై రెవెన్యూ వచ్చే అవకాశం లేదు. వాస్తవానికి ఈ వీడియోకు డబ్బులు ఇచ్చారా? లేదా? అనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

గూగుల్ కంపెనీ యూట్యూబ్​ను కొనుగోలు చేసినప్పుడు, జావెద్ కరీమ్​కు ఈక్విటీ రూపంలో 1,37,443 షేర్లను అందించింది. వీటిలోని కొన్ని షేర్లను 2006లోనే కరీమ్ అమ్మేశారు. ఇంకా ఆయన దగ్గర మిగిలిన ఉన్న షేర్ల విలువ ప్రస్తుతానికి సుమారుగా 390 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.

యూట్యూబ్ ప్రస్థానం
ప్రముఖ వీడియో ఫ్లాట్​ఫామ్ యూట్యూబ్​ను చాడ్ హుర్లీ, స్టీవెన్ చిన్, జావెద్ కరీమ్‌ 2005 ఫిబ్రవరి 14న ప్రారంభించారు. వీళ్లు ముగ్గురు పేపాల్ మాజీ ఉద్యోగులు. ఆ తర్వాత యూట్యూబ్​ను 2006లో గూగుల్ కొనుగోలు చేసింది. ప్రస్తుత కాలంలో యూట్యూబ్ మంచి ప్రజాదరణ పొందుతోంది. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ యూట్యూబ్​ను వినియోగిస్తున్నారు.

వారెన్​ బఫెట్ నుంచి 'గ్రేట్ లెసన్'​ నేర్చుకున్న బిల్ గేట్స్ - అది ఏంటో తెలుసా? - Bill Gates Time Management Lessons

మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'​ను ఎప్పుడైనా చూశారా? - Crazy Concept Bike

ABOUT THE AUTHOR

...view details