ETV Bharat / technology

2025 సుజుకి యాక్సెస్ కెవ్వు కేక!- మిడిల్​ క్లాస్ మెచ్చే స్కూటర్ అంటే ఇదే! - 2025 SUZUKI ACCESS 125 LAUNCHED

మారుతీ సుజుకి నయా యాక్సెస్ 125 లాంఛ్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

2025 Suzuki Access 125
2025 Suzuki Access 125 (Photo Credit- Suzuki Motorcycle India)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 20, 2025, 3:51 PM IST

2025 Suzuki Access 125 Launched: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్​సైకిల్ ఇండియా భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో కొత్త సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేసింది. కంపెనీ దీన్ని OBD2- నిబంధనలకు అనుగుణంగా అప్​డేట్ చేసి అదిరే కలర్ ఆప్షన్​లతో దేశీయ మార్కెట్ కోసం తీసుకొచ్చింది. వీటితో పాటు మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125లో చాలా మార్పులు చేశారు.

సుజుకి యాక్సెస్ 125 పవర్‌ట్రెయిన్: ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్​తో వస్తుంది. ఈ ఇంజిన్ 6,500rpm వద్ద 8.3bhp శక్తిని, 5,000rpm వద్ద 10.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ గతంలో కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని రేంజ్​ను పెంచేందుకు కంపెనీ దీనికి మునుపటి కంటే పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్​ను అందించింది.

సుజుకి యాక్సెస్ 125 డిజైన్: ఈ స్కూటర్ స్టైలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రీవియస్ సుజుకి యాక్సెస్ 125 అప్​డేటెడ్ వెర్షన్​లా కన్పిస్తుంది. LED హెడ్‌లైట్ స్క్వేర్ షేప్​తో వస్తుంది. అయితే సైడ్ ప్యానెల్స్​ నీట్​గా క్రీజ్ లైన్స్​తో వస్తాయి. స్కూటర్ మొత్తం డిజైన్​ను కంప్లీట్ చేసే క్రమంలో టెయిల్​ సెక్షన్​ను కాస్త సర్దుబాటు చేశారు.

సుజుకి యాక్సెస్ 125 ఫీచర్లు: ఎక్స్​టీరియర్ ఫ్యూయెల్ ఫిల్లింగ్ లిడ్, రెండు ఫ్రంట్ పాకెట్స్, పొడవైన సీటు, మునుపటి కంటే పెరిగిన అండర్ సీట్ స్టోరేజ్ వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఈ స్కూటర్​లో పాస్ స్విచ్, వెనుక బ్రేక్ లాక్, హజార్డ్ లైట్ స్విచ్ కూడా అందించారు. అంతేకాక ఇది బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. దీనిలో రెయిన్ అలర్ట్, డిజిటల్ వాలెట్, ఫ్యూయెల్ కన్సెప్షన్ ఇన్ఫర్మేషన్​తో పాటు మరిన్ని ఇతర ఫీచర్లు ఉన్నాయి.

వేరియంట్స్: కంపెనీ ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125 స్టూటీని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • స్టాండర్డ్
  • స్పెషల్
  • రైడ్ కనెక్ట్ ఎడిషన్

కలర్ ఆప్షన్స్: మార్కెట్లో ఇది ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

  • మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ
  • పెర్ల్ గ్రేస్ వైట్
  • మెటాలిక్ మ్యాట్ బ్లాక్ No. 2
  • సాలిడ్ ఐస్ గ్రీన్
  • పెర్ల్ షైనీ బీజ్

ధర: కంపెనీ ఈ స్కూటర్‌ను రూ.81,700 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

భారత మార్కెట్లోకి MG ZS HEV!- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఇండియాలోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ ఎంట్రీ- వచ్చీ రాగానే అదిరే ఈవీ కార్లతో సంచలనం!

ఐఫోన్ SE 4 ఫస్ట్ గ్లింప్స్ లీక్- డిజైన్, స్పెక్స్​, ధర వివరాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.