Tecno Camon 30s Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ టెక్నో అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్ తీసుకొచ్చింది. తన మిడ్ రేంజ్ టెక్నో కెమన్ 30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
టెక్నో కెమన్ 30ఎస్ ఫీచర్లు:
- డిస్ప్లే: 6.78-అంగుళాల AMOLED స్క్రీన్
- బ్యాటరీ:5,000mAh
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్రైట్నెస్: 1,300 నిట్స్
- చిప్‌సెట్: MediaTek Helio G100
- మెయిన్ కెమెరా: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 13-మెగాపిక్సెల్
కలర్ ఆప్షన్స్:
- సెలెస్టియల్ బ్లాక్
- డాన్ గోల్డ్
- నెబ్యులా వైలెట్
కనెక్టివిటీ ఫీచర్స్:
- Wi-Fi
- బ్లూటూత్
- NFC
- GPS
- 4G LTE
- USB టైప్-సి పోర్ట్
టెక్నో కెమన్ 30ఎస్ మొబైల్ మరిన్ని ఫీచర్లు: ఈ కొత్త టెక్నో కెమన్ 30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇది అథెంటికేషన్ కోసం ఫింగర్‌ఫ్రింట్ స్కానర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.
టెక్నో కెమన్ 30S ధర:8GB RAM, 256GB స్టోరేజీతో దాని టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ ధర PKR 59,999 అంటే సుమారు రూ.18,200గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం టెక్నో తన 6GB + 128GB, 8GB + 128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్‌ల ధరను వెల్లడించలేదు.
కంపెనీ ప్రస్తుతం పాకిస్థానీ మార్కెట్‌లో టెక్నో కెమన్ 30ఎస్‌ను రిలీజ్ చేసింది. సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెలెస్టియల్ బ్లాక్, డాన్ గోల్డ్, నెబ్యులా వైలెట్ కలర్ ఆప్షన్స్‌లో కంపెనీ వెబ్‌సైట్ ద్వారా పాకిస్థాన్‌లో విక్రయిస్తున్నారు. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ కొత్త టెక్నో కెమన్ 30ఎస్ మొబైల్‌ను ఇండియాలో విడుదల చేస్తారా?లేదా? అనే విషయంపై కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
మీ ఫోన్ చోరీకి గురైందా?- వెంటనే ఇలా స్క్రీన్ లాక్ చేసేయండి.. అన్నీ సేఫ్..! - Google Theft Protection Feature
డ్యూయల్ డిస్లేతో లావా అదిరే ఫోన్- ధర ఎంతంటే? - Lava Agni 3 launched