తెలంగాణ

telangana

ETV Bharat / technology

జోరుమీదున్న టాటా మోటార్స్- మరో మూడు కార్లను లాంఛ్ చేసేందుకు కసరత్తు - TATA MOTORS

టాటా మోటార్స్ బిగ్​ ప్లాన్- వచ్చే ఏడాది 3 కార్లను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు

Tata Sierra
Tata Sierra (Tata)

By ETV Bharat Tech Team

Published : Nov 25, 2024, 8:10 PM IST

Tata Motors:టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్, టాటా నెక్సాన్ సీఎన్‌జీ, ఎస్‌యూవి కూపే కర్వ్ వంటి డిఫరెంట్ మోడల్స్​ను 2024లో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఇదే జోరుతో ఇప్పుడు కంపెనీ మరో మూడు అద్భుతమైన కొత్త SUV కార్లను లాంచ్ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. వచ్చే ఏడాది వీటిని రిలీజ్ చేయనుంది. ఇందులో టాటా సియెర్రా, టాటా హారియర్ EV, టాటా సియెర్రా EV ఉండే అవకాశం ఉంది.

టాటా మోటార్స్​ నుంచి మూడు కార్లు: వచ్చే ఏడాది టాటా మోటార్స్​ SUV విభాగంలో ఒకటి కంటే ఎక్కువ కొత్త ప్రొడక్ట్స్​ను రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా మోటార్స్‌కు సియెర్రా అనే SUV మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ ఐకానిక్ కారు తిరిగి వస్తోంది. ఈ ఏడాది మొబిలిటీ ఎక్స్‌పోలో కూడా ఈ కారును ప్రదర్శించారు. కంపెనీ వచ్చే ఏడాది దీన్ని ఉత్పత్తి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు హారియర్ ఎలక్ట్రిక్ మోడల్​ను కూడా రిలీజ్ చేయొచ్చు.

టాటా హారియర్ EV:టాటా మోటార్స్ వచ్చే ఏడాది భారత్​లో దాని మిడ్-సైజ్ SUV హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబిలిటీ ఎక్స్‌పోలో విడుదల చేసిన హారియర్ EV కస్టమర్లను ఆకట్టుకుంది. వచ్చే ఏడాదికి ఇది ఇండియన్ రోడ్లపైకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ టాటా హారియర్ EV పవర్​ఫుల్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది సింగిల్​ ఛార్జ్​పై 600 కి.మీల రేంజ్​ను అందించగలదు. అంతేకాక ఇది అదిరిపోయే లుక్స్​తో పిచ్చెక్కించే ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వనుంది.

టాటా సియెర్రా:టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రా SUVని వచ్చే ఏడాది ప్రథమార్థంలో తిరిగి తీసుకురానుంది. ఇది ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సియెర్రా ఎలక్ట్రిక్ వేరియంట్​తో పాటు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. ఈ కారు స్టైలిష్ లుక్స్, బాక్సీ డిజైన్‌తో వస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోడల్ 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్​ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా అన్ని ఎలక్ట్రిక్, పెట్రోల్-డీజిల్ మోడల్స్ ఫీచర్ల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండనుంది.

పరేషాన్ చేస్తున్న వాట్సాప్- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు!

మీరు జియో సిమ్ వాడుతున్నారా?- ఈ స్పామ్​ కాల్స్ బ్లాక్ సెట్టింగ్ మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details