తెలంగాణ

telangana

ETV Bharat / technology

శాంసంగ్ ప్రియులకు గుడ్​న్యూస్- గెలాక్సీ అన్​ప్యాక్డ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ - SAMSUNG GALAXY UNPACKED EVENT

త్వరలో గెలాక్సీ అన్​ప్యాక్డ్ ఈవెంట్- ఎప్పుడు, ఎక్కడంటే?

The date of Samsung Galaxy Unpacked 2025 Event Has Been Announced
The date of Samsung Galaxy Unpacked 2025 Event Has Been Announced (Photo Credit: YouTube/Samsung)

By ETV Bharat Tech Team

Published : Jan 7, 2025, 5:17 PM IST

Updated : Jan 7, 2025, 5:31 PM IST

Galaxy Unpacked Event 2025:శాంసంగ్ ప్రియులకు గుడ్​న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 డేట్​ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ జనవరి 22న USAలోని శాన్ జోస్‌లో జరగనుంది. శాంసంగ్ ఈ ప్రోగ్రాంలో తన గెలాక్సీ S25 సిరీస్‌ను లాంఛ్ చేయనుంది.

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన అత్యంత ప్రీమియం స్మార్ట్​ఫోన్ లైనప్​ కొత్త సిరీస్​ అంటే గెలాక్సీ S లైనప్‌ను ప్రతి ఏడాది జనవరిలో విడుదల చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈవెంట్​ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్​లో తీసుకొచ్చే స్మార్ట్​ఫోన్ మోడల్స్, వాటిలోని ఫీచర్ల వివరాలను తెలుసుకునేందుకు శాంసంగ్ లవర్స్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్మార్ట్​ఫోన్ వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే మార్కెట్లో గెలాక్సీ ఈ S సిరీస్​ ప్రత్యక్ష పోటీ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్​ లేటెస్ట్ సిరీస్​తో ఉంటుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది జరగబోయే ఈవెంట్​ను గెలాక్సీ అన్​ప్యాక్డ్​ 2025 పేరుతో నిర్వహిస్తుంచనున్నారు. ఈ ఈవెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో దీని వివరాలను కంపెనీ తన అధికారిక న్యూస్​రూమ్ పోస్ట్​ ద్వారా షేర్ చేసింది. ఈ ఈవెంట్ జనవరి 22న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరగనుంది. ఇది Samsung.com, Samsung newsroom, Samsung అధికారిక YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఈసారి కంపెనీ గెలాక్సీ S25 సిరీస్​లో గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా అనే మూడు మోడల్స్​ను తీసుకురానుంది. ఈ అప్​కమింగ్ మొబైల్స్ ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్​ (AI)తో రానున్నాయి. ఈ గెలాక్సీ ఏఐ కొత్త వెర్షన్​ స్మార్ట్​ఫోన్ ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చనుంది. దీంతో​ ఏఐ ప్రపంచంలో ఈ సిరీస్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.

కంపెనీ ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్ల ప్రీ-రిజర్వేషన్లను ఇండియాలో ప్రారంభించింది. శాంసంగ్ ఇండియా స్టోర్​ను సందర్శంచి కస్టమర్లు రూ.1,999 టోకెన్ అమౌంట్​ను చెల్లించి వీఐపీ పాస్​ను పొందొచ్చు. దీని ద్వారా ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు రూ.5,000 ఇ-స్టోర్ వోచర్ రూపంలో అనేక ప్రయోజనాలను పొందొచ్చని శాంసంగ్ తెలిపింది. అంతేకాక వారు రూ. 50,000 విలువైన బహుమతిని కూడా గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇండియన్ మార్కెట్లో వీటి లాంఛ్, ధరల వివరాలపై శాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​పై అంచనాలు:ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ అభివృద్ధి దశలో ఉంది. కాబట్టి దీని గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇండస్ట్రీ ట్రెండ్స్​ ప్రకారం..

  • ఇది Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో శాంసంగ్ One UI 6.0 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
  • ఇది క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 8 Gen 3 లేదా శక్తివంతమైన Exynos చిప్‌సెట్‌ని కలిగి ఉండొచ్చు.
  • S25, S25+లో AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz లేదా అంతకంటే ఎక్కువ.
  • S25 అల్ట్రా లార్జ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది మెరుగైన రిఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంటుంది.
  • S25, S25+ మూడు కెమెరాలను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ కాంతిలో కూడా గ్రేట్ ఫొటోస్ అండ్ వీడియోలను రికార్డ్ చేయగలవు.
  • ఇక S25 అల్ట్రా 200MP మంచి ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీని సహాయంతో జూమింగ్​లో కూడా మంచి పిక్చర్లను క్లిక్ చేయొచ్చు.
  • వీటితో పాటు ఈ సిరీస్​ అనేక ఏఐ ఫీచర్లతో రానున్నాయి. అంతేకాక ఈ ఫోన్​లు బిగ్ బ్యాటరీని కలిగి ఉండి చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి.

ప్రీమియం ఫీచర్లతో వన్​ప్లస్​ 13 సిరీస్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో

సిట్రోయెన్ బసాల్ట్‌ SUV ధర పెంపు- గరిష్టంగా రూ.28,000!- ఇప్పుడు దీని రేటెంతంటే?

Last Updated : Jan 7, 2025, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details