Samsung Galaxy M15 5G Prime Edition:ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ ఎం సిరీస్‌లో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. బిగ్ బ్యాటరీతో ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ పేరిట కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గెలాక్సీ ఎం15 5జీని శాంసంగ్ తీసుకొచ్చింది. దానికే చిన్నచిన్న మార్పులు చేసి ఇప్పుడు ప్రైమ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మొబైల్ ఫోన్‌కు నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ కంపెనీ చెబుతోంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్లు, రిటైల్ స్టోర్లలో ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ ఫీచర్స్:
- డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్
- రిఫ్రెష్ రేటు: 90Hz
- ప్రాసెసర్:మీడియా టెక్ డైమెన్‌సిటీ 6100+
- ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 14
- వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్
- మెయిన్ కెమెరా:50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 3 ఎంపీ
- బ్యాటరీ:6,000 ఎంఏహెచ్
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్
- యూఎస్‌బీ టైప్-సి పోర్ట్
- 3.5 ఎంఎం ఆడియో జాక్
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్లో కలర్ ఆప్షన్స్:
- బ్లూ టోపాజ్
- సెలిస్టెయిల్ బ్లూ
- స్టోన్ గ్రే
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ వేరియంట్స్:ఈ కొత్త శాంసంగ్ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ మొబైల్ మొత్తం మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
- 4GB+128GB వేరియంట్
- 6GB+128GB వేరియంట్
- 8GB+128GB వేరియంట్