ETV Bharat / technology

ఆకాశంలో అద్భుతం.. మీరు ఎప్పుడైనా 'బ్లాక్​ మూన్' చూశారా?- ఇప్పుడు మిస్సైతే మళ్లీ ఎప్పటికో..! - BLACK MOON

'బ్లాక్​ మూన్​'కు సమయం ఆసన్నం- ఎప్పుడు దర్శనమిస్తుందంటే?

Black Moon
Black Moon (Photo Credit: NASA Goddard)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 30, 2024, 1:53 PM IST

Black Moon: ఆకాశంలో ఇవాళ రాత్రి ఓ అద్భుతం సాక్షాత్కారం కాబోతుంది. ఇప్పటి వరకు మనకు చంద్రుడు తెల్లగా పాలరాతిలా మెరుస్తూ ఉంటాడని తెలుసు. అయితే కేవలం తెలుపు రంగులో మాత్రమే కాకుండా రెడ్, ఎల్లో, పింక్ వంటి ఎన్నో రంగుల్లో కన్పించడం కూడా మనం చూశాం. అయితే ఇప్పుడు మాత్రం అరుదైన 'బ్లాక్​ మూన్'​ను చూడబోతున్నాం.

బ్లాక్​ మూన్​ ఎప్పుడు కన్పిస్తుంది?: US నావల్ అబ్జర్వేటరీ ప్రకారం.. డిసెంబర్ 30న ఆకాశంలో 'బ్లాక్​ మూన్' ప్రత్యక్షం అవుతుంది. ఇది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని ప్రజలకు రేపు అంటే డిసెంబర్ 31న కన్పిస్తుంది. మన దేశంలో కూడా ఈ 'బ్లాక్ మూన్'ను డిసెంబర్ 31 ఉదయం 3:57 గంటలకు చూడొచ్చు.

అసలేంటీ బ్లాక్​ మూన్?: ఇండియన్ క్యాలెండర్ ప్రకారం.. ఒక సీజన్‌లో నాలుగు అమావాస్యలు వస్తే అందులో మూడో అమావాస్యను 'బ్లాక్​ మూన్'​గా పిలుస్తారు. అంటే ఒక నెలలో రెండో అమావాస్య సంభవించినప్పుడు 'బ్లాక్ మూన్' అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఈ 'బ్లాక్​ మూన్' చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇది ప్రతి 29 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది. సీజనల్​గా ప్రతి 33 నెలలకు కన్పిస్తుంది.

'బ్లాక్​ మూన్' అనేది పౌర్ణమితో వచ్చే 'బ్లూ మూన్'​ను పోలి ఉంటుంది. అయితే ఇది మాత్రం అమావాస్యతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే అమావాస్య తర్వాత వచ్చే రాత్రి ఈ 'బ్లాక్​ మూన్' దర్శనమిస్తుంది. ఈ రాత్రి శుక్ల పక్షంలోని ప్రతిపద రాత్రి. దీనిని నవచంద్ర అని కూడా పిలుస్తారు. ఇక శుక్ల పక్షంలోని మొదటి రోజును ప్రతిపద అని పిలుస్తారు.

చంద్రుడు నిజంగానే నల్లగా కనిపిస్తాడా?: నిజానికి చంద్రుడు నల్లగా కన్పించనప్పటికీ దీని ప్రభావం ఈ రాత్రి ఆకాశంలో గణనీయంగా కన్పిస్తుంది. ఈ చీకటి రాత్రి చంద్రునిలో కొంత భాగాన్ని మాత్రమే కనిపించేలా చేస్తుంది. ఇది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ తక్కువ కాంతిలో మనం నక్షత్రాలు, గ్రహాలు, సుదూర గెలాక్సీలను చూడగలం. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగించి ఈ రాత్రంతా కన్పించే బృహస్పతి, సాయంత్రం ప్రకాశవంతంగా కనిపించే శుక్రుడు వంటి గ్రహాలను చూడొచ్చు.

బ్లాక్​ మూన్ ఎలా ఏర్పడుతుంది?: సూర్యుడు, చంద్రుడు ఒకే దిశలో సమాంతరంగా ఉన్నప్పుడు మూన్​.. భూమికి ప్రకాశవంతగా కన్పించదు. ఇది సూర్యునికి ఎదురుగా ఉండటం వల్ల దానిపై కాంతి పడదు. దీంతో ఆ రాత్రి 'బ్లాక్​ మూన్' ఏర్పడుతుందని అంతా అంటుంటారు. ఆస్ట్రానమీలో ఇది అధికారిక పదం కానప్పటికీ, ఖగోళ శాస్త్ర ప్రేమికులు దీన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రాత్రి ఆకాశం చీకటిగా స్పష్టంగా మారుతుంది. దీంతో నక్షత్రాలు, గ్రహాలను చూడటానికి ఈ రాత్రి చాలా అనుకూలంగా ఉంటుంది.

తక్కువ కాంతి కారణంగా నక్షత్రరాశులు, గ్రహాల వీక్షణ ఖగోళ శాస్త్ర ప్రియులకు మరింత అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఉత్తర అర్ధగోళంలో నివసించే వారికి ముఖ్యంగా.. ఓరియన్, వృషభం, సింహరాశి నక్షత్రరాశులు రాత్రిపూట ఆకాశంలో దర్శనమిస్తాయి. దక్షిణ అర్ధగోళంలో.. కానోపస్‌తో పాటు సదరన్ క్రాస్ (క్రక్స్) కన్పిస్తుంది. ఇది కారినా నక్షత్రరాశిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక నెక్స్ట్​ 'బ్లాక్ మూన్' ఆగస్ట్ 23, 2025న కన్పిస్తుంది. దీని తర్వాత మళ్లీ ఇది ఆగస్టు 31, 2027న ప్రత్యక్షమవుతుంది.

భూమికి గుడ్​బై చెప్పనున్న రెండో మూన్- ఆకాశంలో రెండు చందమామలు ఉన్నాయని మీకు తెలుసా?

సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'

'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.