Rolls Royce Ghost Facelift Launched:లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత మార్కెట్‌లో కొత్త 'ఘోస్ట్ సిరీస్ II'ని విడుదల చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రోల్స్ రాయిస్.. ఈ ఘోస్ట్ సిరీస్ IIను అక్టోబర్, 2024లో గ్లోబల్‌గా పరిచయం చేసింది. ఇప్పుడు ఎట్టకేలకూ ఈ లగ్జరీ సెడాన్ అదిరే అప్డేట్లతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
వేరియంట్స్: కంపెనీ ఈ కారును మూడు విభన్న వేరియంట్లలో తీసుకొచ్చింది.
- స్టాండర్డ్
- ఎక్స్‌టెండెడ్
- బ్లాక్ బ్యాడ్జ్
కంపెనీ ఈ లగ్జరీ సెడాన్‌ను బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. దీని డెలివరీలు మాత్రం 2025 ఫస్ట్ క్వార్టర్లో ప్రారంభంకానున్నాయి. ఈ సెడాన్‌ను రీడిజైన్ చేసి ఘోస్ట్ సిరీస్ IIలో కొత్త ఎక్స్టీరియర్ కలర్‌ను పరిచయం చేశారు. దీన్ని మస్టిక్ బ్లూ రంగులో తీసుకొచ్చారు.
ఇది కొత్త ట్రాపెజోయిడల్- షేప్‌లో హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేట్ చేసిన DRL యూనిట్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, కొద్దిగా రీషేప్ చేసిన ఎయిర్ ఇన్టెక్స్తో వస్తుంది. దీని టెయిల్ ల్యాప్స్ డిజైన్ మాత్రం అలాగే ఉంచారు. కానీ అవి న్యూ ప్యాటెర్న్తో వస్తాయి. వీటితో పాటు ఈ కొత్త ఘోస్ట్ ఇప్పుడు 9-స్పోక్ డిజైన్‌తో రెండు కొత్త 22-అంగుళాల వీల్స్ ఆప్షన్‌తో వస్తుంది.
ఇంటీరియర్: ఈ కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్ దాని పాత మోడల్ మాదిరిగానే స్టన్నింగ్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ దీనికి అట్రాక్టివ్ ఫుల్-లెన్త్ గ్లాస్ ప్యానెల్‌ను కూడా జోడించింది. ఇది రోల్స్ రాయిస్ వినూత్న 'స్పిరిట్' ఆపరేటింగ్ సిస్టమ్‌ను హైలైట్ చేస్తుంది. అంతేకాక ఎక్స్టెన్సివ్ కస్టమైజేషన్ ఆప్షన్లకు పేరొందిన ఈ ఘోస్ట్ సిరీస్ ఇప్పుడు గ్రే-స్టెయిన్డ్ యాష్ అండ్ ఇంట్రికేట్ డ్యూయలిటీ ట్విల్ వంటి వైడర్ రేంజ్ మెటీరియల్స్‌తో వస్తుంది.
వీటితో పాటు ఘోస్ట్ సిరీస్ II 'ప్లేస్డ్ పెర్ఫరేషన్' అనే ఓ యునిక్ అప్హోల్స్టరీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సీట్లలో 107,000 రంధ్రాలను కలిగి ఉంటుంది. రోల్స్ రాయిస్ గుడ్‌వుడ్ హెడ్ క్వార్టర్‌పై ఉన్న క్లౌడ్ ఫార్మేషన్‌లను అనుకరించేలా జాగ్రత్తగా ఈ చిల్లులను ఏర్పాటు చేశారు. వెనుక సీటులో కూర్చున్నవారి ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చేందుకు, ప్రయాణీకులు ఇప్పుడు ఎంటర్నైన్మెంట్ కోసం వారి సంబంధిత స్క్రీన్‌లపై రెండు స్ట్రీమింగ్ డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు.