Realme 14x 5G Launched In India:రియల్‌మీ ఎట్టకేలకు భారత్‌లో తన '14x 5G' స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను IP69 రేటింగ్‌తో ప్రీమియం డైమండ్ డిజైన్‌లో తీసుకొచ్చింది. దీంతో ఈ మొబైల్‌ను వేడి నీటిలో ముంచినా కూడా ఏం కాదని రియల్‌మీ చెబుతోంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో కంపెనీ దీన్ని కేవలం రూ. 14,999 ప్రారంభ ధరతోనే రిలీజ్ చేసింది. అంతేకాక ఈ మొబైల్‌పై ప్రారంభ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ కొత్త 'రియల్‌మీ 14x 5G' స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లతో పాటు బ్యాంక్ ఆఫర్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:
- డిస్ప్లే:6.67-అంగుళాల HD+
- రిఫ్రెష్ రేట్:120Hz
- రిజల్యూషన్: 1604 x 720 పిక్సెల్
- పీక్ బ్రైట్‌నెస్:625 నిట్స్
- బ్యాటరీ:6,000mAh
- ప్రాసెసర్:ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300
- 8GB వరకు RAM అండ్ 128 GB స్టోరేజ్
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరా సెటప్: ఈ ఫోన్ 4Kలో వీడియోలను షూట్ చేయగల f/1.8 ఎపర్చర్‌తో 50MP మెయిన్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
వేరియంట్స్: ఈ 'రియల్‌మీ 14x' 5G మొబైల్ మార్కెట్లో రెండు వేరియంట్లలో లభిస్తుంది.
- 6GB RAM + 128 GB
- 8GB RAM + 128 GB
కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ మొబైల్‌ను మూడు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.
- జ్యువెల్ రెడ్
- గోల్డెన్ గ్లో
- క్రిస్టల్ బ్లాక్