ETV Bharat / technology

మార్కెట్లో ఈవీ స్కూటర్ల జోరు- ఏడాదిలో 10 లక్షల యూనిట్ల సేల్స్- టాప్ మోడల్స్​పై మీరూ ఓ లుక్కేయండి! - EV BIKES YEAR ENDER 2024 STORY

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్- విజయానికి కారణాలివే!

Electric Two Wheelers
Electric Two Wheelers (Photo Credit- Bajaj, TVS, Ola)
author img

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

EV Bikes Year Ender 2024 Story: మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న కాలుష్యం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాంకేతిక పురోగతి, మారుతున్న వినియోగదారుల డిమాండ్ల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు (ఇ-బైక్‌లు) పుట్టుకొచ్చాయి. ఈ ఏడాది ఈ సెగ్మెంట్​లో ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్, హీరో ఎలక్ట్రిక్ బైక్‌లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

10 లక్షల యూనిట్ల సేల్స్: ఈ ఇ-బైక్‌లు పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు సమర్థవంతమైన రవాణా విధానాన్ని అందిస్తాయి. ఈ సంవత్సరం ప్రముఖ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌ను విస్తరించాయి. మెరుగైన మోడల్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న నెట్‌వర్క్‌తో ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 12 మధ్య మొత్తం రిటైల్ సేల్స్ 10లక్షల 987 యూనిట్లకు చేరుకున్నాయి.

దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల వృద్ధి: భారత్​లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, గవర్నమెంట్ సబ్సిడీలు, వాతావరణానికి అనుకూలంగా ఉండడం వంటి కారణాలతో ప్రజలు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అనేక బైక్ తయారీదారులు, కొత్త స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని గుర్తించాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లో కొంగొత్త ఎలక్ట్రిక్ బైక్​లను తీసుకొచ్చాయి.

EV కొనుగోలుపై సబ్సిడీ: భారత ప్రభుత్వం 2024లో హైబ్రిడ్, EV కొనుగోళ్లపై సబ్సిడీని ప్రకటించింది. గవర్నమెంట్ ఈ పాలసీలతో EV వాహనాల కొనుగోలుపై మొగ్గుచూపుతున్నారు. దీంతోపాటు బ్యాటరీ సామర్థ్యం, ఎలక్ట్రిక్ మోటార్ పనితీరులో సాంకేతిక పురోగతి వినియోగదారులకు ఇ-బైక్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చింది.

EV బైక్‌ల విజయానికి కారణం ఇదే!:

  • అఫర్టబిలిటీ అండ్ కాస్ట్: ప్రస్తుతం ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ పెట్రోల్​తో నడిచే బైక్​లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దీంతో ప్రజలు వీటి వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారు.
  • గవర్నమెంట్ సపోర్ట్: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, తయారీదారులకు ప్రోత్సాహకాలు వంటి వాటిని ప్రభుత్వం అందించడంతో ఇవి వినియోగదారులకు అఫర్డబుల్ ప్రైజ్​లోనే లభిస్తున్నాయి.
  • ఎన్విరాన్మెంట్​పై ఫోకస్: దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు ప్రజలు పర్యావరణానికి అనుకూలమైన వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ బైక్‌లు, జీరో-ఎమిషన్ వెహికల్స్ పర్యావరణాన్ని రక్షించగలవు.
  • బ్యాటరీ లైఫ్ అండ్ పెర్ఫార్మెన్స్: బ్యాటరీ సాంకేతికతలో పురోగతి కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌ల రేంజ్, పనితీరు గణనీయంగా మెరుగుపడింది. వీటి ఛార్జింగ్, మౌలిక సదుపాయాలపై ఇంతకు ముందు ఉన్న ఆందోళనలు కూడా ఇప్పుడు తగ్గాయి.
  • ట్రాఫిక్ రద్దీ: భారతీయ నగరాల్లో పెరుగుతున్న రద్దీకి ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక ఆచరణాత్మక పరిష్కారంగా పరిగణించబడుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్​ల నిర్వహణ చాలా సులభం. అలాగే దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.
  • కొంగొత్త ఫీచర్లు: ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థలు టూ-వీలర్స్​లో కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ న్యూ టెక్నాలజీలు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇవి స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ, రియల్​ టైమ్ డయాగ్నస్టిక్స్ వంటి అధునాతన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ బైక్స్: నవంబర్ 2024 నాటికి వివిధ ఎలక్ట్రిక్ బైక్‌లు వాటి పెర్ఫార్మెన్స్, డిజైన్, అఫెర్డబుల్ ప్రైస్, సేల్స్​ తర్వాత సమగ్ర సర్వీసుల కారణంగా ఇవి భారతీయ వినియోగదారుల దృష్టిని ఆకర్షించాయి. వాటిలో టాప్ మోడల్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Ola S1 Pro: ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ధర, అధునాతన ఫీచర్ల కారణంగా వీటికి మంచి ప్రజాదరణ లభించింది. 'ఓలా S1 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్కూటర్. ఇది హై పెర్ఫార్మెన్స్​తో పాటు ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

'ఓలా S1 ప్రో' స్కూటర్​లో ముఖ్యమైన ఫీచర్లు:

  • రేంజ్: సింగిల్ ఛార్జ్​తో 170-200 కి.మీ
  • బ్యాటరీ: 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
  • ఛార్జింగ్ టైమ్: 6 గంటలు (సాధారణ ఛార్జింగ్)
  • టాప్ స్పీడ్​: 115 km/hr
  • ధర: 1.30 లక్షల నుంచి 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • సేల్స్​: 3,76,550 యూనిట్స్​

ఇతర ఫీచర్లు: 'ఓలా S1 ప్రో' స్కూటర్‌లో లార్జ్ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, నావిగేషన్, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉన్నాయి. 115 kmph గరిష్ట వేగంతో దీని రేంజ్ సిటీ రైడర్స్​ను ఆకట్టుకుంటుంది.

2. TVS iQube Electric: TVS కంపెనీ.. తన 'iQube Electric'తో భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఈ ఏడాది ఆధిపత్యం చెలాయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి సేల్స్​ను రాబట్టాయి.

ముఖ్యమైన ఫీచర్లు:

  • రేంజ్: సింగిల్​ ఛార్జ్​తో 75-85 కి.మీ
  • బ్యాటరీ: 3.0 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
  • ఛార్జింగ్​ టైమ్: 5 గంటలు
  • టాప్ స్పీడ్: 78 km/hr
  • ధర: రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • సేల్స్​: 1,87,301 యూనిట్స్​

ఈ TVS iCube Electric దాని విశ్వసనీయత, పెర్ఫార్మెన్స్, స్మూత్ రైడ్ క్వాలిటీ, మోడ్రన్ డిజైన్​తో ప్రసిద్ధి చెందింది. ఇది మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, రియల్ టైమ్ డయాగ్నస్టిక్స్, రిమోట్ ట్రాకింగ్‌ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. TVS తన సర్వీస్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించింది. ఇది నగర ప్రయాణికులలో 'iQube' ప్రజాదరణను పెంచడంలో సహాయపడింది.

3. Bajaj Chetak Electric: చేతక్ ఎలక్ట్రిక్‌తో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి బజాజ్ ఎంట్రీ ఇచ్చింది. దేశీయ టూ-వీలర్​ మార్కెట్లో దీని స్టైల్, పనితీరుతో ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్​ మంచి ప్రజాదరణను పొందింది.

ముఖ్యమైన ఫీచర్లు:

  • రేంజ్: సింగిల్ ఛార్జ్​పై 95-105 కి.మీ
  • బ్యాటరీ: 4.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
  • ఛార్జింగ్ టైమ్: ఫుల్​ ఛార్జ్ కోసం 5 గంటలు (హోమ్ ఛార్జింగ్‌తో సహా)
  • టాప్​ స్పీడ్​: 60 km/hr
  • ధర: రూ.1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • సేల్స్​: 1,57,528 యూనిట్స్

'చేతక్ ఎలక్ట్రిక్'.. రీజెనరేటివ్ బ్రేకింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. దీని పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్​ బ్రాండ్​ ఐడెంటిటీని మరింత బలపరిచింది. బజాజ్ ఎక్స్​టెన్సివ్ సర్వీస్ నెట్​వర్క్​ను కూడా ఏర్పాటు చేసింది. ఇది భారత మార్కెట్లో చేతక్​ విజయానికి దోహదపడింది.

4. Ather 450X: 'ఏథర్ ఎనర్జీ EV' భారత మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్. అత్యాధునిక సాంకేతికతకు పేరుగాంచిన ఈ 'ఏథర్ 450ఎక్స్' మార్కెట్లో భారీ ఆధిక్యాన్ని సాధించింది.

ముఖ్యమైన ఫీచర్లు:

  • రేంజ్: 70-100 కిమీ (రైడింగ్​ మోడ్‌ను బట్టి)
  • బ్యాటరీ: 3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
  • ఛార్జింగ్ టైమ్​: 1 గంట (ఫాస్ట్ ఛార్జింగ్)
  • టాప్​ స్పీడ్: 80 km/hr
  • ధర: రూ. 1.40 లక్షల నుంచి రూ. 1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • సేల్స్​: 1,07,350 యూనిట్స్

ఇది టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, అధునాతన టెలిమాటిక్స్, నావిగేషన్, మల్టీ రైడింగ్ మోడ్​లను కలిగి ఉంది. ఇది దాని ప్రీమియం పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్​ యాక్సిలరేషన్ వంటి స్మార్ట్​ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. దీంతోపాటు కంపెనీ.. 'Ather Grid' అనే ఎక్స్​టెన్సివ్ ఛార్జింగ్ నెట్​వర్క్​ను కూడా అందిస్తుంది.

5. Hero Electric Optima HX: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్​లో హీరో ఎలక్ట్రిక్ చాలా కాలంగా అగ్రగామిగా ఉంది. 'ఆప్టిమా HX' ఇండియాలో మోస్ట్ ఎకనామికల్ ఎలక్ట్రిక్ బైక్స్​లో ఒకటి. ఇది దేశీయ మార్కెట్లో గణనీయమైన కస్టమర్ బేస్‌ను సంపాదించుకుంది.

ముఖ్యమైన ఫీచర్లు:

  • రేంజ్: సింగిల్​ ఛార్జ్​తో 82 కి.మీ
  • బ్యాటరీ: 1.53 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
  • ఛార్జింగ్ టైమ్: 4-5 గంటలు
  • టాప్ స్పీడ్: 45 km/hr
  • ధర: రూ. 75,000 నుంచి రూ.85,000 (ఎక్స్-షోరూమ్)
  • సేల్స్: 2,650 యూనిట్లు

హీరో ఎలక్ట్రిక్ 'ఆప్టిమా HX' అఫర్డబిలిటీ, ప్రాక్టికాలిటీ, తక్కువ ధరకు ప్రసిద్ధి చెందింది. ఇది కొన్ని హై-ఎండ్ మోడల్స్​ వంటి పెర్ఫార్మెన్స్​ను కలిగి లేనప్పటికీ దాని బడ్జెట్-ఫ్రెండ్లీ ధర, వినియోగ సౌలభ్యం.. సిటీ ప్రయాణీకులకు, ఫస్ట్​ టైమ్ EV కొనుగోలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్​గా మారింది.

6. Revolt RV400: రివోల్ట్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో మార్కెట్లో స్ట్రాంగ్​ మూవ్ ఇచ్చింది. కంపెనీ బెస్ట్​ మోడల్స్​లో 'RV400' ఒకటి. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ఎక్కువ పవర్ కోసం చూస్తున్న వారికి ఇది ఉత్తమ ఎంపిక.

ముఖ్యమైన ఫీచర్లు:

  • రేంజ్​: సింగిల్​ ఛార్జ్​తో 150-180 కి.మీ
  • బ్యాటరీ: 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
  • ఛార్జింగ్ టైమ్: 4 గంటలు
  • టాప్ స్పీడ్: 85 km/hr

  • సేల్స్​: 8,947 యూనిట్లు

'రివోల్ట్ RV400' AI-యాక్టివేటెడ్ బైక్ మేనేజ్‌మెంట్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రీప్లేస్ చేయగల బ్యాటరీ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇది హై-స్పీడ్ మోటార్‌ను కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.

భారత్​లో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌కు మరింత డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్-డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది.

ఎటు చూసినా ఏఐ- స్మార్ట్​ఫోన్ మార్కెట్లోనూ హవా- ఈ ఏడాది లాంఛ్ అయిన టాప్ మోడల్స్ ఇవే!

6000mAh బ్యాటరీ ప్యాక్​తో 5G ​ఫోన్- నీటిలో పడినా ఏం కాదంట.. ధర కూడా రూ.15వేల లోపే!

మెర్సిడెస్​ నుంచి లగ్జరీ 5-సీటర్ బెంజ్ - దేశంలోనే ఏ EVకి లేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.