తెలంగాణ

telangana

ETV Bharat / technology

పవర్​ఫుల్ ప్రాసెసర్​తో పోకో కొత్త స్మార్ట్​ఫోన్- లాంఛ్​కు ముందే పనితీరు, స్పెసిఫికేషన్ల లిస్టింగ్ రివీల్! - POCO X7 NEO

త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'పోకో X7 నియో'- వివరాలివే!

Representative photo
Representative photo (POCO)

By ETV Bharat Tech Team

Published : 6 hours ago

POCO X7 Neo Launch in India:ఇండియన్ మార్కెట్లోకి పోకో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. కంపెనీ 'పోకో X7 నియో' పేరుతో దీన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్ పనితీరు, స్పెసిఫికేషన్ల లిస్టింగ్ రివీల్ అయ్యాయి.

ఈ స్మార్ట్​ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ 2409FPCC4Iతో Xiaomi హ్యాండ్‌సెట్ కన్పించింది. దీనిలో 'I' అనేది ఇండియన్ వేరియంట్​ని సూచిస్తుంది. దీంతో భారత వేరియంట్​లో 'పోకో X7 నియో' మొబైల్​ త్వరలో రాబోతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. గీక్‌బెంచ్ అనేది డివైజ్​ల పనితీరును అంచనా వేసి స్కోర్ ఇస్తుంది.

ఇక ఈ మొబైల్ సింగిల్-కోర్ టెస్ట్​లో 943 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్​లో 2,247 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్ ఆధారంగా ఫోన్ మల్టీ టాస్కింగ్​ను నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఇది 6GB RAMతో పాటు ఇతర RAM వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉండొచ్చు. అంతేకాక ఇది Android 14 ఆధారంగా అప్‌డేట్ చేయబడిన ఇంటర్‌ఫేస్ HyperOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండొచ్చు.

ఫీచర్లు:ఈ ఫోన్ ఆప్షనల్ 8GB లేదా 12GB RAMతో వస్తుంది. గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ప్రకారం.. 'పోకో X7 Neo' మొబైల్ పవర్​ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్​ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ కచ్చితంగా ఏ ప్రాసెసర్​తో వస్తుంది అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

కోర్ ఆర్కిటెక్చర్, క్లాక్ స్పీడ్ ఆధారంగా.. ఈ ఫోన్మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రాని కలిగి ఉండొచ్చు. ఇది చిప్ 6+2 కోర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. 6 ఎఫిషియన్సీ కోర్​వు 2.0GHz, 2 హై-పెర్ఫార్మెన్స్ కోర్‌లు 2.50GHz వద్ద రన్ అవుతాయి. ఈ ఆర్కిటెక్చర్ భారతదేశంలో ఇటీవల లాంచ్ అయిన 'రెడ్​మీ నోట్ 14'లో ఉంది.

'రెడ్​మీ నోట్ 14' 5Gకి సమానమైన ఫీచర్లు: 'పోకో X7 నియో' మొబైల్​లో​ 'రెడ్​మీ నోట్ 14 5G'లో మాదిరిగా అనేక ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే పోకో వాటిని 'పోకో X6 నియో'లో చేసినట్లుగా కొంచెం ఛేంజ్ చేయొచ్చు. 'పోకో X6 నియో' అనేది 'రెడ్​మీ నోట్ 13 5G' మొబైల్ సరసమైన వెర్షన్.

ఇక ఇటీవల విడుదల చేసిన 'రెడ్​మీ నోట్ 14' మొబైల్ 6.67-అంగుళాల AMOLED డిస్​ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఇది 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు వెనకవైపు 2MP సెన్సార్, ముందు భాగంలో 16MP కెమెరాతో రిలీజ్ అయింది. 'పోకో X7 నియో' ఇండియన్ వేరియంట్ కూడా ఇలాంటి ఫీచర్లతో లాంఛ్ కావచ్చు. ఈ ఫీచర్లతో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇది మంచి ఆప్షన్​గా మారే అవకాశం ఉంది. దీని రిలీజ్ తర్వాతే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్- ఇది అలాంటిలాంటిది కాదుగా.. అంచనాలకు మించి!

వాట్సాప్​ నయా ఫీచర్లు అదుర్స్.. వీడియో కాల్స్​లో న్యూ ఎఫెక్ట్స్.. ఇక కాల్స్​ లైవ్​లో నవ్వులే నవ్వులు!

రూ.10వేలకే 5G స్మార్ట్​ఫోన్లు- ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ- మార్కెట్లో వీటిని మించినదే లేదు..!

ABOUT THE AUTHOR

...view details