తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఈ పండక్కి కొత్త ఫోన్ కొనాలా?- అది కూడా తక్కువ ధరలో..?- అయితే ఒప్పో A3x 4Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్​ ధరలో ఒప్పో కొత్త మొబైల్- ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!!!

Oppo A3x 4G Launch
Oppo A3x 4G Launch (Oppo India)

By ETV Bharat Tech Team

Published : 5 hours ago

Oppo A3x 4G Launch: దీపావళి పండగ వేళ మార్కెట్లోకి ఒప్పో నుంచి ఓ కొత్త స్మార్ట్​ఫోన్ వచ్చింది. కొంగొత్త ఫీచర్లతో బడ్జెట్ ధరలో కంపెనీ Oppo A3x 4G మొబైల్​ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ Snapdragon 6s Gen 1 చిప్‌సెట్​తో వస్తుంది. 4జీబీ ర్యామ్‌తో ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఇండియన్ మార్కెట్లో ఈ మొబైల్ నెబ్యులా రెడ్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం Oppo A3x 4G మొబైల్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Oppo A3x 4G స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

  • డిస్​ప్లే: 6.67-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌
  • రిఫ్రెష్ రేట్‌: 90Hz
  • బ్రైట్‌నెస్‌:గరిష్టంగా 100నిట్స్ వరకు
  • బ్యాటరీ: 5,100mAh
  • సైజ్:165.77x76.08x7.68ఎమ్ఎమ్
  • వెయిట్:186గ్రాములు
  • 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌
  • బ్యాక్ కెమెరా: 8ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 5ఎంపీ
  • 45డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్ట్

Oppo A3x 4G కెమెరా: ఈ కొత్త ఫోన్ 8ఎంపీ బ్యాక్ కెమెరా 78-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ, ఎఫ్/2.0 ఎపర్చర్​తో వస్తుంది. దీని ఫ్రంట్ సైడ్ 78-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే కటౌట్‌లో ఉన్న 5ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కలర్ ఆప్షన్స్:

  • నెబ్యులా రెడ్
  • ఓషన్ బ్లూ

Oppo A3x 4G కనెక్టివిటీ ఫీచర్స్:

  • యూఎస్‌బీ టైప్-సి పోర్ట్
  • 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ పోర్ట్‌తో పాటు 4జీ ఎల్‌టీఈ
  • డ్యూయల్-బ్యాండ్ వై-ఫై
  • బ్లూటూత్ 5.0
  • జీపీఎస్

ఇతర ఫీచర్స్:

  • ఒప్పో ఈ ఫోన్​లో​ ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్‌ అమర్చింది.
  • ఒప్పో ఎ3ఎక్స్ 4జీ మొబైల్​లో 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 స్టోరేజీని పొందొచ్చు.
  • ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఉంది.

ఇండియన్ మార్కెట్లో దీని ధర:

  • 4GB ర్యామ్+64GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌ ధర: రూ. 8,999
  • 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 9,999

అక్టోబర్ 29 నుంచి ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా ఈ కొత్త మొబైల్​ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ వెల్లడించింది.

ఓపెన్ ఏఐ నుంచి మరో అద్భుతం..?- క్లారిటీ వచ్చిందిగా..!

7 నెలల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు- సక్సెస్​ఫుల్​గా స్పేస్‌ఎక్స్ క్రూ-8 మిషన్ కంప్లీట్!

ABOUT THE AUTHOR

...view details