ChatGPT Search Engine Feature:ఏఐ ఆధారిత చాట్ జీపీటీని లాంచ్ చేసి సంచలనం సృష్టించిన ఓపెన్‌ఏఐ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌కు పోటీగా ChatGPT సెర్చ్ ఇంజిన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ యూజర్స్ తమ చాట్ హిస్టరీని సెర్చ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు అవసరమైన సమాచారాన్ని పాత చాట్ల నుంచి తిరిగి పొందొచ్చు.
ChatGPT ఈ కొత్త సెర్చ్ ఫీచర్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇది యూజర్ల ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు ఆన్లైన్లో వెతికి మరీ వారి ముందుంచుతుంది. అంతేకాక స్పోర్ట్స్ నుంచి స్టాక్ అప్‌డేట్స్ వరకు అన్నింటినీ కవర్ చేస్తూ ఇకపై యూజర్లకు తమ ప్రశ్నలకు తక్షణ సమాధానాలతో పాటు ఇందుకు సంబంధించిన వెబ్ లింక్స్ కూడా అందుబాటులోకి వస్తాయని కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ChatGPT వెబ్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
చాట్ హిస్టరీ సెర్చ్ ఫీచర్: గతంలో ఓపెన్ ఏఐ X (ట్విటర్)లో పోస్ట్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. పాత చాట్లను హిస్టరీని సెర్చ్ చేసుకునేందుకు ఉపయోగపడే ఈ ఫీచర్ కోసం యూజర్స్ చాలా కాలంగా ఎదురుచూడగా.. ఎట్టకేలకూ కంపెనీ ఇప్పుడు దీన్ని లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న యూజర్స్‌కు విండోకు ఎడమవైపున ఉన్న ChatGPT వెబ్ సైడ్ప్యానెల్లో కొత్త భూతద్దం గుర్తుతో కన్పిస్తుంది. యూజర్స్ దీనిపై ట్యాప్ చేసి స్పెసిఫిక్ కీవర్డ్స్‌ను టైప్ చేసి అవసరమైన పాత చాట్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు.